తెలంగాణాలోని అన్ని జిల్లాలు ఒక ఎత్తైతే గ్రేటర్ హైదరాబాద్ కొంత ప్రత్యేకం. అన్ని జిల్లాలకు కేంద్ర బిందువు. ఆర్థికంగా ప్రధాన వనరు. ఇక్కడ గెలుపును అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. టీఆర్ఎస్ అభ్యర్థుల విషయాన్ని తేల్చేయగా, మహా కూటమిలో సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రాలేదు.
గ్రేటర్ హైదరాబాద్ లో గత ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న స్థానాలను మరలా ఇవ్వాలని కోరుతుందట. కాంగ్రెస్ కూడా ఇవే స్థానాలు కావాలని పట్టుబట్టడంతో సమస్య మొదలైంది. తమకు ఖచ్చితమైన ఓటు బ్యాంకు ఉందని తెలుగు దేశం నేతలు చెబుతుండగా, ఈ సారి తమకు వదిలేయాలని అనడం ఎంత వరకు సమంజసం అంటున్నారు.
ఇక్కడ మొత్తం 24 సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ 9 - బీజేపీ 5 - ఎంఐఎం 7 - టీఆర్ఎస్ 3 సీట్లు సాధించాయి. కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాలేదు. తెలంగాణ ప్రకటన చేసిన తరువాత ఆ పార్టీ ఇరు రాష్ట్రాల్లో చాలా తక్కువ స్థానాల్లో గెలిచింది. టీడీపీ మెజార్టీ స్థానాలను గెలుపొందడంతో, ఈ సారి కూడా తమకు ఆ స్థానాలు ఇస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతామని అని కూటమి పెద్దలు ముందు ప్రతిపాదన ఉంచారంట.
అసలు కాంగ్రెస్ మిత్ర పక్షాలకు 27 నుంచి 30 సీట్లలోపు ఇచ్చి సర్దుబాటు చేద్దామని భావిస్తుందట. అసలు 20లోపే పరిమితం చేయాలని కొందరు నేతలు అంటున్నారంట. ఆ మేరకు గ్రేటర్ హైదరాబాద్ లో కొన్ని స్థానాలు తమకు కేటాయించాలని అడుగుతుండం టీడీపీ నేతలకు నచ్చడం లేదు. కాగా, ఎల్బీ నగర్ నుంచి గెలిచిన ఆర్ కృష్ణయ్య మినహా మిగతా వారెవరు టీఆర్ ఎస్ లో చేరలేదు. ఇదే విషయాన్ని కూటమి ముందు చెబుతున్నారట.
అయితే, కాంగ్రెస్ పార్టీ నేతలు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో టీడీపీ నేతలు అంతర్మధనం మొదలైంది. ఒక వేళ కాంగ్రెస్ కు సీట్లు అప్పగిస్తే ఓట్లు చీలి అసలుకే ఎసరు వస్తుందేమోనని భావిస్తున్నారు. దీంతో గ్రేటర్లో సీట్ల సర్దుబాటు వ్యవహారం కూటమికి పెద్ద సవాల్ గా మారింది.