ఎవరి పని వారు చేయాలని ఉత్తినే చెప్పలేదు. ఎప్పుడేం చెప్పాలో.. ఏం చెప్పకూడదన్న ప్రాథమిక అవగాహన లేనోళ్లంతా సలహాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చి.. చిక్కుల్లో పడిపోతుంటారు. తాజాగా అలాంటి అనుభవమే పతంజలి యోగా గురువు రాందేవ్ బాబాకు ఎదురైంది. బుద్దిగా యోగా క్లాసులోయోగాసనాల గురించి చెప్పటం మానేసి.. తనకేమాత్రం సంబంధం లేని.. షేర్లు వేటిని కొనాలి? ఎందుకు కొనాలి? లాంటి సలహాల్ని ఇచ్చి ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యారు. ఇంతకూ అసలేం జరిగిందంటే..
తాను నిర్వహించే యోగా తరగతుల్లో యోగా పాఠాలు చెప్పే క్రమంలో రాందేవ్ బాబా.. షేర్ మార్కెట్ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటేమిటంటే.. ''మీ అందరికీ కోటీశ్వరులు అయ్యే మంత్రం చెబుతాను జాగ్రత్తగా వినండి. మీరంతా ఈ రోజే డీ మ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేయండి. స్టాక్ మార్కెట్‌లో లావాదేవీలు నిర్వహించేందుకుద అన్నీ ఏర్పాట్లు చేసుకోండి. నేను చెప్పినప్పుడు రుచి సోయా కంపెనీకి చెందిన షేర్లు కొనండి. అలా కొన్న వాటిని తిరిగి అమ్మడం , కొనడం వంటి పనులు చేయకండి. వాటిని కొన్న వెంటనే 'సమాధి' చేయండి. ఎక్కువ కాలం మీ దగ్గరే ఉంచుకోండి. పతంజలి తర్వాత లక్ష కోట్ల రూపాయల కంపెనీ అయ్యే అర్హతలు రుచి సోయాకు ఉన్నాయి' అంటూ గొప్పలు చెప్పారు.
వాస్తవానికి ఇప్పుడీ వీడియో యూ ట్యూబ్ లో ఎక్కడా కనిపించటం లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాందేవ్ సలహా ఇస్తున్నప్పుడు వీడియో తీసినోళ్ల నుంచి షేర్ చేసుకున్న వారు.. సదరు వీడియోను సెబికి తమ కంప్లైంట్ తో పాటు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ వీడియోను చూసిన సెబీ సీరియస్ అయ్యింది. ఎందుకంటే.. స్టాక్ మార్కెట్ లో జరిగే లావాదేవీలకు సంబంధించిన అంశాల్ని నిర్వహించే సెబీ.. మార్కెట్ మీద అవగాహన లేని వారు సలహాలు ఇవ్వకూడదు.
ఇలా చేయాలంటే సర్టిఫైడ్ కోర్సులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే సలహాలు.. సూచనలు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే.. సర్టిఫైడ్ కాని వారు ఇచ్చే మాటల్ని విని మదుపు చేస్తే.. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. అందుకే.. షేర్ మార్కెట్లో ఏం కొనాలన్నదానిపై ఎవరికి వారు తమకున్న అవగాహనతో కొనేస్తుంటారు. లేదంటే ఎవరైనా నిపుణుల సూచనలు తీసుకుంటారు. దీనికి భిన్నంగా రాందేవ్ బాబు తనకు తోచినట్లుగా ఇచ్చిన సలహాపై సీరియస్ అయిన సెబీ.. తాజాగా బాబా నుంచి వివరణ కోరింది.
ఆయనకు చెందిన పతంజలి సంస్థ సోయా రుచి ఆయిల్స్ కంపెనీకి ప్రమోటర్ గా ఉంది. త్వరలో ఈ సంస్థ ఎఫ్ పీవో ద్వారా రూ.4300 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఉంది. ఇలాంటివేళ.. ఆయన నోటి నుంచి వచ్చిన సోయా షేర్లను కొనాలన్ సలహాపై సెబీ సీరియస్ గా ఉంది. రుచితో పాటు ఎఫ్ పీవోకి.. మర్చంట్ బ్యాంకర్లు ఉన్న వారికి సెబీ నోటీసులు జారీ చేసింది. మరి.. దీనికి యోగా గురువు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.