బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసి సంచలనం రేపిన ఎన్సీబీ ముంబై జోనల్ అధికారి సమీర్ వాంఖడే తీరుపై అటు ప్రశంసలు.. ఇటు విమర్శలు వెల్లువెత్తాయి. సమీర్ వాంఖడే బాలీవుడ్ సినీ సెలెబ్రెటీలను టార్గెట్ చేశాడని.. ఆర్యన్ విడుదల కోసం రూ.25 కోట్లు డిమాండ్ చేశాడని ఒక సాక్షి ఆరోపించి అఫిడవిట్ దాఖలు చేయడంతో సమీర్ వాంఖడేపై విచారణకు విజిలెన్స్ ఆదేశించింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
వాంఖడే సిన్సియర్ అధికారిగా పేరుతెచ్చుకున్నారు. అక్రమార్కులకు సింహస్వప్నం లాంటి ఆఫీసర్ అన్న పేరుంది. అయితే తాజాగా వాంఖడేపై వచ్చిన ఆరోపణలు.. ఆయన వ్యవహరిస్తున్న తీరు.. ట్రాక్ రికార్డు.. ముప్పేట జరుగుతున్న దాడి నేపథ్యంలో వాంఖడే బదిలీ తప్పదనే మాట వినిపిస్తోంది.
సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. మహారాష్ట్ర ఇమేజ్ ను డ్రగ్స్ చిన్న కేసులతో డ్యామేజ్ చేస్తున్నాడని మండిపడుతోంది. మంత్రి నవాబ్ మాలిక్ అయితే సాక్ష్యాలతో సమీర్ వాంఖడే లంచం డిమాండ్ చేశాడని ఆరోపించారు. అయితే వాంఖడే కేంద్ర ప్రభుత్వ ఐఆర్ఎస్ అధికారి కావడంతో ఆయనను కేంద్రమే బదిలీ చేయాల్సి ఉంటుంది.
మహారాష్ట్రలోని శివసేన సర్కార్ ను కేంద్రం పట్టించుకోదు. వారిద్దరి మధ్య విభేదాలున్న సంగతి తెలిసిందే. వాంఖడేపై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ తప్పనిసరిగా మారినట్టుగా ఉంది. ఆర్యన్ ఖాన్ దొరికిన స్పాట్ నుంచి 25 కోట్ల రూపాయల మొత్తాన్ని డిమాండ్ చేశాడనే ఆరోపణలు సంచనలంగా మారాయి. ఇదంతా కుట్ర అని వాంఖండే అంటున్నారు.
షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ అరెస్ట్ నేపథ్యంలో ఇదంతా సమీర్ వాంఖడేపై కావాలని చేస్తున్నారని.. కక్ష సాధింపు చర్యలన్న వాదన వినిపిస్తోంది. వాంఖడే తమను డబ్బు డిమాండ్ చేసినట్టుగా షారుఖ్ ఫ్యామిలీ ఇప్పటివరకూ చెప్పలేదు. ఈ విషయంపై స్పందించలేదు. వారి దృష్ట్యంతా ఆర్యన్ ఖాన్ ను విడిపించుకునేందుకే అన్నట్టుగా ఉంది.
ఇక సమీర్ పలువురు సెలబ్రెటీలను వేధించినట్టు కథనాలున్నాయి. కస్టమ్స్ లో పనిచేసినప్పుడు ముంబై ఎయిర్ పోర్టులో షారుఖ్ ఖాన్ ను కొన్ని గంటల పాటు ఎయిర్ పోర్టులో నిర్బంధించిన చరిత్ర ఉందట.. మరికొంత మంది బాలీవుడ్ సెలబ్రెటీలు అనేకమందికి కూడా ఈ అధికారి నుంచి ఇదే అనుభవం ఎదురైందట.. ఇలా చాలా మంది సమీర్ వాంఖడేపై దుమ్మెత్తిపోస్తున్నారు. మరోవైపు నిజాయితీ అధికారి అని తెలిసిన వారు అంటున్నారు. ప్రస్తుతం విజిలెన్స్ విచారణ తర్వాత అసలు మ్యాటర్ బయటపడనుంది. ప్రస్తుతానికి ఈ ఇష్యూ నుంచి సమీర్ వాంఖడేను బదిలీ చేసేందుకు కేంద్రం రెడీ అయినట్టుగా తెలుస్తోంది.