షా ప‌ర్య‌ట‌న‌లో భ‌ద్ర‌తా వైఫ‌ల్యం.. ప‌రుగులు పెట్టిన అధికారులు.. ఏం జ‌రిగింది?

Update: 2022-09-17 08:30 GMT
కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. నిజాం పాల‌కుల నుంచి తెలంగాణ‌ను భారత యూనియ‌న్‌లో క‌లుపుకొన్న సెప్టెంబ‌రు 17ను విమోచ‌న దినంగా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన కేంద్రప్ర‌భుత్వం..  ఈ క్ర‌మంలో స్వ‌యంగా.. హోం మంత్రిని ఇక్క‌డ‌కు పంపించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న శుక్ర‌వారం రాత్రికే హైద‌రాబాద్ చేరుకున్నారు.

అనంత‌రం శ‌నివారం ఉద‌యం.. పెరేడ్ గ్రౌండ్స్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అమ‌ర వీరుల‌కు నివాళుల‌ర్పించారు. జాతీయ‌ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. అనంత‌రం.. ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మం ముగిసిన త‌ర్వాత‌.. ఆయ‌న విడిది చేసిన హ‌రిత ప్లాజాకు భారీ కాన్వాయ్‌తో బ‌య‌లు దేరి వెళ్లారు. అయితే.. ఇక్క‌డే అనుకోని అవాంతరం వ‌చ్చింది. ఆయ‌న కాన్వాయ్ లోప‌లికి వెళ్ల‌కుండా.. ఎవ‌రో కారును అడ్డంగా పెట్టారు.

అంతేకాదు..కారులో ఆ స‌మ‌యంలో ఎవ‌రూ లేరు. పైగా కారు డోర్లు లాక్ చేసి ఉన్నాయి.  ఈ ఘ‌ట‌న తీవ్ర సంచ‌ల‌నంగా మారింది. ఉగ్ర‌వాదులు ఏమైనా ఇంత సాహ‌సం చేశారా? అనే సందేహాలు సైతం వ్య‌క్త‌మ య్యాయి. దీంతో హుటా హుటిన స్పందించిన షా భ‌ద్ర‌తా సిబ్బంది.. వెంట‌నే కారు అద్దాలు  పగలగొట్టి చూశారు. అయితే.. కారులో ఎవ‌రూ క‌నిపించ‌లేదు. కానీ, అందులో.. అధికార పార్టీ జెండాలు క‌నిపించాయ‌ని.. తాము స్వాధీనం చేసుకున్నామ‌ని.. బీజేపీ నేత‌లు తెలిపారు.

ఇక‌, ఈ కారు ఎవ‌రిది అనే విష‌యంపై అనేక సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. TS 19 EZ T/R 3418 నెంబ‌రుతో ఉన్న ఈ కారుకు ఇంకా పూర్తిస్థాయి రిజిస్ట్రేష‌న్ కూడా కాలేద‌ని తెలుస్తోంది. ఇది..సాబూ ఆర్కేఎస్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విక్ర‌యించిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా జెడ్ + కేట‌గిరీ భ‌ద్ర‌త‌లోఉండ‌డం.. ఆయ‌న కాన్వాయ్‌కు అడ్డంగా కారు నిల‌ప‌డం.. వంటి వాటిని అధికారులు చాలా సీరియ‌స్‌గా తీసుకున్నారు. మ‌రి దీనిపై ఏం జ‌రుగుతుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News