సెక్యూరిటీ షాక్ తగిలిన స్టార్స్ ఎవరంటే..?

Update: 2016-01-08 08:25 GMT
బాలీవుడ్ స్టార్ లకు సెక్యూరిటీ షాక్ తగిలింది. నిన్నమొన్నటి వరకూ భారీగా భద్రత కలిగించిన పలువురు స్టార్ లకు సెక్యూరిటీని కుదిస్తూ ముంబై పోలీసులు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఇంతకాలం భారీగా బందోబస్తు ఉన్న పలువురు స్టార్ లకు ప్రత్యేక భద్రత అంటూ ఏమీ ఉండదు. ఇప్పటితో పోలిస్తే.. ఇకపై సాధారణ భద్రతను మాత్రమే కల్పిస్తారు.

ఇలా భద్రతను కుదిస్తూ నిర్ణయం తీసుకున్న వారిలో బాలీవుడ్ అగ్రనటులు షారూక్ ఖాన్.. అమీర్ ఖాన్ లతో పాటు బాలీవుడ్ ప్రముఖులు విదు వినోద్ చోప్రా.. రాజ్ కుమార్ హిరానీ.. ఫరాఖాన్.. కరీం మొరాని తదితరులకు ఇప్పటివరకూ అందిస్తున్న సెక్యూరినీ కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి నుంచి ఈ ప్రముఖులకు.. ఇద్దరు ఆయుధాలతో కలిగిని కానిస్టేబుళ్లను కేటాయిస్తారు.

అదే సమయంలో.. మరికొందరు బాలీవుడ్ ప్రముఖులకు మాత్రం భద్రతను ఇప్పటి మాదిరే కొనసాగిస్తున్నారు. అలాంటి వారిలో బిగ్ బి అమితాబ్ బచ్చన్.. దిలీప్ కుమార్.. లతామంగేష్కర్ లాంటి వారున్నారు. ప్రముఖులకు పెద్ద ఎత్తున భద్రతను కల్పించటం కారణంగా సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నట్లుగా ముంబయి పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ప్రముఖులకు భద్రతను తగ్గించిన ప్రతిసారీ ఇలాంటి పల్లవి పాడటం మామూలే. మరి.. సిబ్బంది కొరత ఇప్పటివరకూ ఏమైనట్లు..?
Tags:    

Similar News