చందమామ అనగానే.. నీలాకాశంలో తెల్లని ఛాయతో మధ్య మధ్య మచ్చలతో అలరించడం.. చల్లని కాంతిని ప్రసరింపజేయడం వరకు మాత్రమే ఇప్పటి వరకు మనకు తెలుసు. పున్నమి నాడు పూర్తి చంద్రబింబం.. సాక్షాత్కరించడం.. వెన్నల రేయిలో గడిపేయడం.. వరకు మనకు అనుభమే. కానీ, చందమామలోనూ అనేక రంగులు ఉన్నాయట. అంతేకాదు.. ఒక్కొక్క రంగుకు ఒక్కొక్క కారణం కూడా ఉందట. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) తాజాగా వెల్లడించింది. అంతేకాదు.. చందమామ రంగుల ఫొటోను(ఉన్నది ఉన్నట్టు) తీసి ప్రపంచానికి సరికొత్త చందమామను నాసా పరిచయం చేసింది.
హరివిల్లును పోలిన..
దీంతో ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో భారీ ఎత్తున వైరల్ అవుతోంది. చందమామ గురించి పూర్తిగా తెలుసుకోవాలని ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అబివృద్ధి చెందిన దేశాలు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. మన భూ గ్రహానికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడే. ఇలాంటి చందమామకు సంబంధించి నాసా షేర్ చేసిన ఫొటో చూస్తే ఇది మనకు తెలిసిన చందమామేనా? అనే అనుమానం కలగకమానదు. ఎందుకంటే మనకు తెలిసినంత వరకూ చందమామ దూరం నుంచి తెల్లగా, దగ్గరకెళ్తే బూడిద రంగులో కనబడుతుంది. కానీ ఇప్పుడు నాసా షేర్ చేసిన చిత్రంలో మాత్రం రంగురంగుల హరివిల్లులా కనిపిస్తోంది.
రీజనేంటి?
1989 అక్టోబర్ 18న నాసా అట్లాంటిస్ అనే స్పేస్ షటిల్‌ను ప్రయోగించింది. దీని సాయంతో గెలీలియో అనే ఉపగ్రహాన్ని గురుగ్రహం వద్దకు పంపింది. అలా వెళ్లే క్రమంలో గెలీలియో శాటిలైట్.. మన చంద్రుడి ఉత్తర ధృవానికి సంబంధించిన కొన్ని ఫొటోలను తీసింది. ఈ చిత్రాలను కలిపితే చందమామ 'ఫాల్స్ కలర్డ్ మొజాయిక్' చిత్రం రెడీ అయిందని నాసా తెలిపింది. ఈ ఫొటోలో చంద్రుడిపై రకరకాల రంగుల ప్రాంతాలు కనిపిస్తున్నాయి.
రంగు రంగుకు ప్రత్యేకత
చందమామపై ఉన్న రంగులకు ప్రత్యేకత ఉందని నాసా పేర్కొంది. గులాబీ రంగులో ఉన్న ప్రాంతంలో ఎత్తైన కొండల వంటి ప్రదేశం. నీలం నుంచి నారింజ రంగు షేడ్స్.. చంద్రుడిపై పురాతన కాలంలో లావా పొంగిన ప్రదేశాన్ని సూచిస్తుంది. ముదురు నీలం రంగు ఉన్న ప్రాంతంలో అపోలో-11 నౌక ల్యాండయింది. ఇక లేత నీలం రంగు చంద్రుడిపై ఉన్న ఖనిజాలను సూచిస్తుందని నాసా వివరించింది. మొత్తానికి పైకి కనిపించే చందమామలో `ఇన్ని రంగులు` ఉన్నాయా? అని చూసినవారు నోరెళ్లబెట్టడం ఖాయం అంటున్నారు నాసా శాస్త్రవేత్తలు.