కేటీఆర్‌ కు దిమ్మ తిరిగే షాకిచ్చిన సీమాంధ్రులు?

Update: 2018-10-29 14:30 GMT
ఊహించ‌ని ఘ‌ట‌న ఒక‌టి జ‌రిగింది. ఊహ‌కు అంద‌ని రీతిలో జ‌రిగిన ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు రాజ‌కీయంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర తీసింది. ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ‌లో విజ‌యం సాధించాల‌నే పార్టీకి ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా అవ‌స‌ర‌మైన సీమాంధ్రుల ఓట్ల కోసం కేటీఆర్ ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది.

చంద్ర‌బాబును తిట్టే క్ర‌మంలో సీమాంధ్రుల మ‌నోభావాలు దెబ్బ తినేలా కేసీఆర్ వ్యాఖ్య‌లు ఉంటున్నాయి. ఈ విష‌యంపైన సీమాంధ్రుల్లో తీవ్ర ఆగ్ర‌హం.. ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికైనా స‌రే.. కేసీఆర్ చేత ఈ విష‌యం మీద ఒక ప్ర‌క‌ట‌న చేయించాలంటూ కేటీఆర్ పాల్గొన్న స‌భ‌లో ఎంపిక చేసిన వ‌క్త‌లు సూటిగా ప్ర‌శ్నించ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

హ‌మారా హైద‌రాబాద్ పేరుతో టీఆర్ఎస్ నేత‌లు ఒక కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. ఈ కార్య‌క్ర‌మం కాన్సెప్ట్ ఏమంటే.. హైద‌రాబాద్‌లో ఉండే అంద‌రూ ఒక్క‌టేన‌న్న భావ‌న క‌లిగించ‌టం.. హైద‌రాబాద్ మ‌నంద‌రిది అన్న‌ట్లే.. ఈ న‌గ‌రంలో ఉండే వారంతా ఒక్క‌టేన‌న్న‌ట్లుగా చెప్పే ఈ కార్య‌క్ర‌మాన్ని నిజాంపేట‌లో ఏర్పాటు చేశారు.

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో అత్యంత జ‌న‌సాంధ్ర‌త ఎక్కువ‌గా ఉండే ప్రాంతంగా నిజాంపేట‌కు పేరుంది. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఆ ప్రాంతాల్లో దాదాపు 90 శాతానికి పైగా సీమాంధ్రులే ఉంటార‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. అలాంటి చోట ఏర్పాటు చేసిన స‌భ‌లో.. అక్క‌డి చుట్టుప‌క్క‌ల తాజా మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఆ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి టీఆర్ఎస్ కు జంప్ అయిన వారే. వారు ఎంపిక చేసిన 21 మంది (ఒక్కో నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఏడుగురుచొప్పున వ‌క్త‌ల్ని ఎంపిక చేశారు)ని ఎంపిక చేశారు.

వారు మాట్లాడుతూ కేటీఆర్ స‌మ‌క్షంలోనే కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.సీమాంధ్రుల మ‌న‌సుల్ని గాయ‌ప‌రిచేలా కేసీఆర్ వ్యాఖ్య‌లు ఉంటున్నాయ‌ని.. వాటిపై స్ప‌ష్ట‌మైన వివ‌ర‌ణ ఇప్పించాల‌న్నారు. నేరుగా చంద్ర‌బాబును టార్గెట్ చేసి మాట్లాడితే టీఆర్ఎస్‌కు ఇబ్బందేన‌ని.. బాబుపై ప‌రోక్షంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు టీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు ఇబ్బంది క‌లిగించేలా ఉన్నాయ‌న్నారు.

టీఆర్ ఎస్ కు అనుకూలంగా ఉన్న మాపై తీవ్ర ఒత్తిడి వ‌స్తోంది. మ‌న ప్రాంతంలో విజ‌న్ ఉన్న నాయ‌కుడ్నిసీమాంద్ర ద్రోహులు అంటూ కేసీఆర్ నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నారని.. దీనిపై కేసీఆర్ చేత ప్ర‌క‌ట‌న చేయించాల‌ని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఎదుటే అంత ఓపెన్ గా మాట్లాడిన తీరు సంచ‌ల‌నంగా మారింది.

ఇలా మాట్లాడిన వారికి సంబంధించి చూస్తే.. ధ‌ర్మారె్డ్డి వ్య‌క్తి మాట్లాడుతూ.. ‘‘కేటీఆర్‌ గారు.. మీ పక్కన కూర్చున్న ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్‌ అనుకుంటున్నారేమో.. వారంతా ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేలేనని గుర్తుంచుకోండి’’ అని వ్యాఖ్యానించటం గ‌మ‌నార్హం.

అంతేనా.. ఐదు దశాబ్దాల కిందట వచ్చి స్థిరపడిన తమను సెటిలర్లు అనడం సమంజసం కాదన్నారు. రెండు రాష్ట్రాలూ అభివృద్ధిలో పోటీ పడాలని, ఇంకా కులం, ప్రాంతాల పేరిట రాజకీయం తగదన్నారు. 21 మంది మాట్లాడిన అనంతరం వారిని ఉద్దేశించి కేటీఆర్‌ ప్రసంగించారు. ‘‘మీరు అడగచ్చు.. చంద్రబాబును కానీ.. టీడీపీని కానీ.. టార్గెట్‌ చేయాల్సిన అవసరం ఏమిటని..? రాజకీయాల్లో ఒకరిపై ఒకరం తలపడడం, విమర్శలు చేయడం సహజమే. చంద్రబాబు కేసీఆర్‌ను విమర్శించడం.. కేసీఆర్‌ చంద్రబాబును - ఉత్తమ్‌ ను విమర్శించడం సహజమే. దానిని ప్రజలను ఏదో అన్నట్లు అనుకుంటే తప్పవుతుంది. చంద్ర‌బాబు మీద చేసే విమ‌ర్శ‌ల‌న్నీ ఆయ‌న్ను ఉద్దేశించిన‌వే త‌ప్పించి మ‌రేమీ కావు. వాటిని మీరు మ‌న‌సుల్లో పెట్టుకోవ‌ద్దంటూ బుజ్జ‌గింపు ధోర‌ణిలో కేటీఆర్ మాట్లాడ‌టం విశేషం.
Tags:    

Similar News