షాకింగ్ ఉదంతం ఒకటి బయటకు వచ్చింది. హైదరాబాద్ లోని ఓల్డ్ బోయినపల్లిలో చోటు చేసుకున్న ఈ ఉదంతం గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఓపక్క కరోనా వ్యాప్తికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వాలు కిందామీదా పడుతూ చర్యలు తీసుకుంటూ ఉంటే.. అందుకు భిన్నంగా కొందరు చేస్తున్న అతి.. అందరికి ముప్పుగా మారనుంది. తాజాగా బయటకు వచ్చిన ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే. భర్త.. పిల్లలతో కొంతకాలంగా సింగపూర్ లో ఉండే నిజామాబాద్ కు చెందిన మహిళ ఒకరు తాజాగా హైదరాబాద్ కు వచ్చారు.
అందరి మాదిరే ఆమెను కూడా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలంటూ చేతి మీద ముద్ర వేసి ఇంటికి వెళ్లిపోవాలన్నారు. అయితే.. నిజామాబాద్ కు వెళ్లాల్సిన ఆమె.. అందుకు భిన్నంగా ఓల్డ్ బోయిన్ పల్లిలోని ఒక కాలనీలో ఫ్లాట్ ను అద్దెకు తీసుకుంది. హోం క్వారంటైన్ లో ఒంటరిగా ఉండాల్సిన ఆమె.. ఆదివారం రాత్రి హస్మత్ పేటకు చెందిన యువకుడ్ని ఫ్లాట్ కు రప్పించుకుంది. పెద్ద శబ్ధంతో పాటు పెట్టుకొని.. మందు పార్టీ చేసుకున్న తీరుతో అపార్ట్ మెంటు వాసులు తీవ్రమైన ఇబ్బందికి గురయ్యారు.
దీన్ని గమనించిన అపార్ట్ మెంటు వాసులు సోమవారం సదరు మహిళను బయటకు పిలిచి నిలదీశారు. ఈ క్రమంలో ఆమె చేతికి ఉన్న క్వారంటైన్ స్టాంప్ ను చూసి.. ఆమెను గదిలో ఉంచేసి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు విచారించగా.. ఆ యువకుడు ఆమె బాయ్ ఫ్రెండ్ అని.. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తన స్వస్థలమైన నిజామాబాద్ కు వెళ్లకుండా హైదరాబాద్ లోనే ఉన్నట్లు గుర్తించారు. ఆ వెంటనే వారిద్దరిపై కేసు నమోదు చేసి.. ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రానికి ఇద్దరిని తరలించారు. ఇలాంటి అతిగాళ్లు మన చుట్టూ ఉంటే.. కరోనా ప్రమాదం ఎంతలా ఉంటుందన్నది ఇట్టే అర్థం కాక మానదు.