ముస్లింలు రాజకీయాలకు బలి కాకూడదంటే... వారి ఓటు హక్కు రద్దు చేయడం మాత్రమే మార్గమని.. సూచిస్తూ మైనారిటీలపై అపారమైన ప్రేమను ఒలికించిన శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ మాటలను కేంద్ర ప్రభుత్వం కూడా ఖండించింది. ముస్లింలకు ఓటు హక్కు రద్దు చేయాలనడం సబబు కాదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఒక ప్రకటన చేశాడు. సంజయ్‌రౌత్ అభిప్రాయాలతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకీభవించేది లేదని.. కేంద్రానికి అలాంటి ఆలోచన ఏదీ లేదని వెంకయ్య స్పష్టం చేశాడు.
తద్వారా కేంద్ర ప్రభుత్వం తమ మిత్రపక్ష పార్టీ తెచ్చి పెట్టిన తలనొప్పి నుంచి విముక్తి పొందే ప్రయత్నం చేసింది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంపై తెగ ఆందోళన వ్యక్తం చేసింది. రౌత్ వ్యాఖ్యలను తప్పుపడుతూ కాంగ్రెస్ ఎంపీలు ధ్వజమెత్తారు.
రౌత్ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని.. ఆయనను అరెస్టు చేసి కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. విధ్వేషపూరిత వ్యాఖ్యానాలు చేసినందుకు రౌత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
శివసేన పార్టీ నేతల చేసిన వ్యాఖ్యానాలపై ఇలా వివిధ పార్టీ నేతలు స్పందించగా... ఒక మాజీ ఏపీఎస్ అధికారి ఈ వ్యవహారంపై కోర్టుకు ఫిర్యాదు చేశారు. శివసేన ఎంపీ రౌత్, ఎమ్‌ఐఎమ్ ఎంపీ ఒవైసీలు ఇద్దరూ మతవిధ్వేషాలను రెచ్చ గొడుతున్నారంటూ ఉత్తరప్రదేశ్‌లోని లక్నో కోర్టులో ఆయన ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై స్పందిస్తూ కోర్టు రౌత్, ఒవైసీలపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.