బ్రేకింగ్ : కరోనాతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మృతి !

Update: 2020-04-27 05:10 GMT
కరోనా మహమ్మారి దేశంలో రోజురోజుకి మరింత వేగంగా విజృంభిస్తుంది. ఇప్పటికే కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కరోనా మృతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. కరోనా పై యుద్ధం చేస్తున్న వైద్యులు , పోలీసులు కూడా కరోనా భారిన పడి కొంతమంది మృతి చెందారు. ఇక తాజాగా కరోనా మహమ్మారి కారణంగా ఒక సీనియర్ రాజకీయనేత తుదిశ్వాస విడిచారు. కరోనా వైరస్ బారిన పడి ఓ రాజకీయ నాయకుడు మరణించడం ఇదే తొలిసారి.

గుజరాత్  కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, అహ్మదాబాద్ కార్పొరేటర్ బద్రుద్దీన్ షేక్ కరోనా కారణంగా ఆదివారం రాత్రి  మరణించినట్లు ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి శక్తిసిన్హ్ గోహిల్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాల పాటు ఆయన పనిచేశారని, ఆయన లేని లోటును తీర్చలేనిదని సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప‌ది రోజుల క్రితం క‌రోనా బారిన‌ ప‌డ్డ ఆయ‌న అప్ప‌టి నుంచి అహ్మ‌దాబాద్‌ లోని ఎస్ ‌వీపీ ఆస్ప‌త్రి ఐసోలేష‌న్ వార్డులో చికిత్స పొందుతున్నారు. అయితే వ్యాధి తీవ్ర‌త పెరుగ‌డం తో ఆదివారం రాత్రి మృతి చెందారు. లాక్‌ డౌన్ నేప‌థ్యంలో వీధివీధికి వెళ్లి ప్ర‌జ‌ల‌కు ఆహారం అందించే క్ర‌మంలో ఆయ‌న క‌రోనాబారిన ప‌డ్డార‌ని తోటి కాంగ్రెస్ నాయ‌కులు తెలిపారు.  

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో అధికార భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని గుజరాత్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఓ కార్పొరేటర్ స్థాయి నాయకుడే వైరస్ వల్ల మరణిస్తే.. ఇక సాధారణ ప్రజల మాటేమిటని నిలదీస్తున్నారు. గుజరాత్‌ లో కరోనా  కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయని, వాటిని నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని విమర్శిస్తున్నారు.
Tags:    

Similar News