తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్న వైఎస్ షర్మిలకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. వైఎస్ఆర్ టీపీకి కీలక నేత రాజీనామా చేశారు. షర్మిల పార్టీలో ముఖ్య సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తాజాగా ఆమె కీలక ప్రకటన చేశారు. రాజీనామా పత్రాన్ని ఆమె విడుదల చేయడం కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర ప్రజల అభీష్టం మేరకు వైఎస్ఆర్ టీపీ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్టు ఇందిరా శోభన్ రాజీనామా చేశారు. అందుకు గల కారణాలను లేఖలో విడుదల చేయడం గమనార్హం.
‘షర్మిల వైఎస్ఆర్ టీపీకి రాజీనామా చేస్తున్నారు. నన్ను ఆదరిస్తున్న తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. అభిమానులు, తెలంగాణ ప్రజల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను’ అని ఇందిరా శోభన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా కాంగ్రెస్ పార్టీని వీడి.. షర్మిల పార్టీలో ఇటీవలే ఇందిరా శోభన్ చేరారు. కానీ ఆ పార్టీలో ఇమడలేక తాజాగా బయటకు వచ్చారు.