తీన్మార్ మల్లన్న.. జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి రాజకీయ నాయకుడిగా ప్రస్థానం కొనసాగిస్తున్న వ్యక్తి. అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై, ఆయన కుటుంబ సభ్యులపై, టీఆర్ఎస్ పార్టీపై తనదైన శైలిలో విరుచుకుపడుతుంటారు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే తిడుతుంటారు.
అలాంటి తీన్మార్ మల్లన్న తాజాగా కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ ఇలాకా అయిన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో పర్యటించిన తీన్మార్ మల్లన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇక నుంచి తాను సీఎం కేసీఆర్‌ను తిట్టనని శపథం చేశారు.
‘7200 మూవ్‌మెంట్` పేరుతో కొత్త కార్యాచరణతో ముందుకు సాగుతున్న తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన ‘7200 మూవ్‌మెంట్’ సన్నాహక సమావేశానికి హజరయ్యారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, ప్రజా సేవ చేయాలనుకునే వారు తమ ఆస్తులన్నీ ప్రభుత్వానికి అప్పగించి రాజకీయాల్లోకి రావాలని సూచించారు.
రాష్ట్రంలో రాజకీయ పాదయాత్రలు జరుగుతున్నాయని, తాను మాత్రం ప్రజలను చైతన్యం చేయటానికే పాదయాత్ర చేయనున్నట్టు చెప్పారు. తన ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చి జూన్2 నుంచి ప్రజా పాదయాత్ర ప్రారంభిస్తానని తీన్మార్ మల్లన్న ప్రకటించారు.
అన్ని హంగులతో గజ్వేల్లో 100 పడకల హస్పిటల్ కట్టినట్టు చెప్తున్న కేసీఆర్.. తన పంటి నొప్పి చికిత్స కోసం స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీకి ఎందుకు పోతున్నాడని మల్లన్న ప్రశ్నించారు. పేదల పిల్లలు సర్కారు బడుల్లో చదువుతుంటే సీఎం మనవడు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడని, అందరి పిల్లలూ సర్కారు బడుల్లోనే చదువుకునేలా వాటిని తీర్చిదిద్దడానికే 7,200 ఉద్యమమని చెప్పారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడమే తన విధానం కాదని, గొప్పోళ్ల, పేదోళ్ల బిడ్డలు ఒకే పాఠశాలలో చదవాలన్నదే తన ఉద్యమ లక్ష్యమని తీన్మార్ మల్లన్న అన్నారు.
యాదాద్రిలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి చేసిన అభివృద్ధి ఒక్క గాలి వానకే తుడిచిపెట్టుకుపోయిందని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్‌ను విడిచి బయటకు రావడం లేదని మండిపడ్డారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దోపిడీ రాజ్యం పోయే వరకు మాత్రం తన ‘7200 మూవ్‌మెంట్’ ద్వారా పోరాడతానని ప్రకటించారు. ఇకపై కేసీఆర్‌ను తిట్టబోనని ఒట్టేసి చెబుతున్నానని తీన్మార్ మల్లన్న కీలక ప్రకటన చేశారు.