ఢిల్లీలో కొత్త సంవత్సరం జనవరి 1 రాత్రి స్కూటీపై వెళ్తున్న 20 ఏళ్ల మహిళను కారులో ఉన్న ఐదుగురు నిందితులు గుద్ది చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులతో కారుతో యువతిని గుద్దాక.. ఆమె కాలులో కారు టైరులో ఇరుక్కుపోయిందనే విషయం వారికి తెలుసని పోలీసుల విచారణలో తేలింది.
అలాగే యువతిని కారు కింద 13 కిలోమీటర్లు ఈడ్చుకుపోయారు. దీంతో యువతి శరీరంపై 40 చోట్ల బలమైన గాయాలు అయ్యాయి. గాయాల తీవ్రత ఎంతగా ఉందంటే.. రోడ్లుపైన ఈడ్చుకుపోవడంతో ఆమె చర్మం ఒలుచుకువచ్చేసింది. దీంతో ఆమె పక్కటెముకలు ఆమె వెనుక నుండి బయటపడ్డాయి, పోస్టుమార్టం రిపోర్టులో ఈ విషయాలు బయటపడ్డాయి.
ఆమె పుర్రె ఫ్రాక్చర్ అయింది. అలాగే మెదడులో కొంత భాగం కనిపించడం లేదని పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. ఈ ప్రమాదంలో యువతికి తల, వెన్నెముక, దిగువ అవయవాలపై బలమైన గాయాలయ్యాయి. కారు ఆమెను 13 కిలోమీటర్లు ఈడ్చుకుపోవడంతో గట్టిగా రోడ్డు కొట్టుకుపోవడంతో యువతికి గట్టి దెబ్బలు తగిలాయని పోస్టుమార్టం పరీక్షలో బయటపడింది.
బాధితురాలు తన స్నేహితురాలితో కలిసి స్కూటర్‌పై న్యూ ఇయర్ పార్టీకి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా ఈ ఘటనకు ముందు మృతి చెందిన యువతితో స్కూటీపై వెళ్లిన యువతి స్నేహితురాలిని కూడా పోలీసులు విచారించారు. కాగా నిందితులకు తమ కారు కింద యువతి ఇరుక్కుపోయిందనే విషయం తెలుసు అని బాధితురాలి స్నేహితురాలు చెప్పింది. తన ఫ్రెండుతో తాను గొడవ పడి స్కూటీ దిగానని.. ఆ సమయంలో కారు స్కూటీపై ఉన్న తన స్నేహితురాలిని ఢీకొట్టిందని ఆమె పోలీసులకు వివరించింది. అంతేకాకుండా కారు కింద చక్రంలో తన స్నేహితురాలు కాలు ఇరుక్కుపోయిందని.. నిందితులు అలాగే ఈడ్చుకుపోయారని వెల్లడించింది.
మృతురాలి స్నేహితురాలు మాట్లాడుతూ.. ''బాలెనో మాకు తల కొట్టింది. దీంతో నేను ఒక వైపు పడ్డాను. నా స్నేహితురాలు ముందు వైపు పడింది. దీంతో తను కారు కింద ఇరుక్కుపోయింది. ఈ విషయం నిందితులకు తెలిసినా వారు ఉద్దేశపూర్వకంగానే ఆమెపైకి దూసుకెళ్లారు. అప్పటికి నా స్నేహితురాలు కేకలు వేసింది' అని మీడియాకు వివరించింది.
''నేను ఇంటికి వెళ్లి ఎవరికీ ఏమీ చెప్పలేదు. నేను ఆ ఘటనతో చాలా భయాందోళనకు గురయ్యాను. చాలా ఏడ్చాను. నిందితులు కారును రెండుసార్లు ముందుకు వెనుకకు నడిపారు. కారు కింద ఏదో ఇరుక్కుపోయిందని అనుమానం రావడంతోనే వారు ముందుకు వెనుకకు వెళ్లారు' అని తెలిపింది.
కాగా యువతి కాలు కారులో ఇరుక్కుందని తాము గమనించలేదని నిందితులు పోలీసులకు తెలిపారు. వారు హరియాణాలోని ముర్తల్ లో మద్యం తాగి ఢిల్లీకి బయలుదేరారు. ఘటన జరిగిన సమయంలో కారులో పెద్దగా సంగీతం పెట్టారు. దీంతో తమకు యువతి అరుపులు వినిపించడం లేదని నిందితులు పోలీసులకు ఇచ్చిన వాంగూల్మంలో పేర్కొన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.