'లాభంలేనిదే వ్యాపారి వరదన కూడా పోడు' అనే సామెత తెలుగులో చాలా పాపులర్. వైసీపీ ఎంపిల వ్యవహారం చూసిన తర్వాత అందరికీ ఇదే సామెత గుర్తుకొచ్చుంటుంది. రెండు రోజుల పర్యటన కోసమని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తన కుటుంబంతో కలిసి తిరుమల పర్యటనకు వచ్చారు. మామూలుగా అయితే తిరుపతి ఎంపి లేదా ఒకే జిల్లా కాబట్టి చిత్తూరు ఎంపి కూడా వచ్చి ఆహ్వానం పలికితే పలకవచ్చు.
కానీ ఇందుకు విరుద్ధంగా తిరుపతి ఎంపి డాక్టర్ గురుమూర్తితో పాటు రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి నేతృత్వంలో మిథున్ రెడ్డి, మార్గాని భరత్ కూడా ఓంబిర్లా వెంటే ఉన్నారు. తిరుమలలో శ్రీవారి దర్శించుకున్నపుడు తర్వాత తిరుచానూరులో అమ్మవారి దర్శనంలో కూడా ఎంపీలంతా స్పీకర్ వెంటే ఉన్నారు. నిజానికి స్పీకర్ వస్తే ఇంత ఎంపిలు హంగామా చేయాల్సిన అవసరం లేదన్నది అందరికీ తెలిసిందే.
మరపుడు ఎందుకింత హంగామా చేశారు ? ఎందుకంటే స్పీకర్ ను మంచిచేసుకోవటానికే స్పీకర్ పై సెంటిమెంటు అస్త్రం ప్రయోగించినట్లున్నారు. వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు పై అనర్హత వేటు స్పీకర్ కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తిరుగుబాటు ఎంపిపై అనర్హత వేటు వేయించేందుకు పార్టీ ఎంపిలు ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటంలేదు. అందుకనే తిరుమల శ్రీవారి దర్శనంలో స్పీకర్ ను దగ్గరుండి చూసుకుంటే తమ పని సులభంగా అయిపోతుందని బ్రహ్మరథం పట్టారు.
అయితే వైసీపీ ఎంపిలు మరచిపోయిన విషయం ఒకటుంది. అదేమిటంటే రఘురామపై అనర్హత వేటు వేయటమన్నది స్పీకర్ చేతిలో లేనిపని. నరేంద్రమోడి దగ్గర నుండి వచ్చే ఆదేశాల ప్రకారం నడుచుకోవటమే స్పీకర్ బాధ్యత. సర్వం సహా చక్రవర్తి నరేంద్రమోడి తలచుకుంటేనే ఏపనైనా అవుతుంది. కేంద్రమంత్రులైనా, స్పీకర్ అయినా, చివరకు రాజ్యసభ ఛైర్మన్ అయినా మోడి చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. మోడిని కాదని స్పీకర్ స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. కాబట్టి వైసీపీ ఎంపిలు సూక్ష్మాన్ని మరచిపోయి స్పీకర్ చుట్టూ తిరగటం కన్నా మోడిని పట్టుకుంటే ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో ?