చార్లెస్ శోభారాజ్ కరడుగట్టిన హంతకుడు. సీరియల్ కిల్లర్. ఐదు దేశాల్లో ఎంతో మందిని హత్య చేసిన కేసులో నిందితుడు. నేపాల్ జైలులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న అతడికి వయోభారం కారణంగా విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో విడుదల చేసేందుకు ముందుకొచ్చింది. శోభారాజ్ 1944 ఏప్రిల్ 6న వియత్నాంలోని సైగాన్ లో జన్మించాడు. తల్లి వియత్నాం పౌరురాలు, తండ్రి భారతీయుడు. తండ్రి శోభారాజ్ ను చేరదీసేందుకు నిరాకరించాడు. ఆ సమయంలోనే శోభారాజ్ కు ఫ్రెంచ్ పౌరసత్వం లభించింది. భారత్, థాయ్ లాండ్ దేశాలకు వచ్చే పర్యాటకులను దోచుకుని హత్య చేయడం అతడికి అలవాటుగా మారింది. ది సర్పెంట్, బికినీ కిల్లర్ వంటి మారు పేర్లతో తిరిగేవాడు.
1972, 1982 మధ్యలో భారత్, థాయిలాండ్, నేపాల్, టర్కీ, ఇరాన్ లలో దాదాపు 20 హత్యలు చేశాడు. యాత్రికులకు మత్తు మందు ఇచ్చి వారి గొంతు కోయడం, కొట్టడం లేదా తగలబెట్టడం వంటి పనులు చేసేవాడు. 1975లో నేపాల్ రాజధాని ఖాట్మండ్ లో ఇద్దరు అమెరికన్ టూరిస్టులను హత్య చేసినందుకు 2003లో నేపాల్ లో శిక్ష అనుభవిస్తున్నాడు. శోభారాత్ వయసును దృష్టిలో ఉంచుకుని అతడిని విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో అతడిని విడుదల చేసి ఫ్రెంచ్ ప్రభుత్వానికి పంపించనున్నారు.
నేపాల్ లో హత్యానేరం రుజువు కాక ముందు భారత్ లో ఫ్రెంచ్ టూరిస్టులను హత్య చేసినందుకు గాను ఇరవై ఏళ్లు జైలు జీవితం గడిపాడు. అప్పుడు జైలు గార్డులకు మత్తు మందు ఇచ్చి తప్పించుకున్నాడు. తనను థాయిలాండ్ కు అప్పగించకుండా ఉండేందుకు అలా చేశానని చెప్పుకొచ్చాడు. అప్పటికే అతడిపై ఐదు హత్యా నేరాలతో థాయిలాండ్ ప్రభుత్వం శోభారాజ్ ను పట్టుకోవాలని చూస్తోంది. శోభారాజ్ భారత్ నుంచి కాకుండా అఫ్గనిస్తాన్, గ్రీస్, ఇరాన్ లలో జైళ్ల నుంచి తప్పించుకున్నాడు.
శోభారాజ్ 1963లో ఆసియా నుంచి తరలివెల్లిన తరువాత సీరియల్ కిల్లర్ గా రూపాంతరం చెందాడు. ఫ్రెంచ్, ఇంగ్లిష్ మాట్లాడేవారితో స్నేహం చేసి వారిని హతమార్చేవాడు. హత్యలు చేయడం జైలుకు వెళ్లడం అక్కడ నుంచి తప్పించుకోవడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. భారత్ లో కూడా రెండుసార్లు జైలు నుంచి తప్పించుకున్నాడు. ఒకసారి తీహార్ జైలు నుంచి కూడా తప్పించుకోవడం గమనార్హం. 1976లో శోభారాజ్ కు 12 ఏళ్ల శిక్ష పడింది. కానీ 1986లో జైలు నుంచి తప్పించుకున్నాడు. పుట్టిన రోజు వేడుక అని చెప్పి బిస్కెట్లు, పండ్లలో నిద్రమాత్రలు కలిపి వారికి ఇచ్చి మూర్చపోయాక తప్పించుకున్నాడు.
భారత్ జైలు నుంచి తప్పించుకుని మళ్లీ దొరికితే ఇక్కడే జైల్లో వేస్తారని దీంతో థాయిలాండ్ లో శిక్ష తప్పించుకోవచ్చని పథకం పన్నాడు. 1997లో శోభారాజ్ విడులయ్యే సమయానికి బ్యాంకాగ్ లో అతడిని ప్రాసిక్యూట్ చేసే గడువు ముగిసింది. దీంతో భారత్ అతడిని ఫ్రాన్స్ కు అప్పగించింది. 2003లో శోభారాజ్ నేపాల్ కు వెళ్లాడు. పోలీసులు అరెస్టు చేస్తారని తెలిసినా లెక్కచేయలేదు. ఖాట్మాండ్ లో అతడిని పట్టుకుని 28 ఏళ్ల కింద కేసును తిరగదోడి అతడిని జైల్లో వేశారు.
నకిలీ పాస్ పోర్టుతో ప్రయాణించి ఒక కెనడా వాసిని, అమెరికన్ మహిళను హత్య చేశాడనే ఆరోపణలతో అరెస్టు చేశారు. 2004లో జీవితఖైదు విధించింది. ఇప్పుడు వయసు రీత్యా జైలు నుంచి విడుదల చేసేందుకు నిర్ణయించింది. కరడుగట్టిన హంతకుడిగా ముద్ర పడిన శోభారాజ్ జీవితమంతా హత్యలే. ఈ నేపథ్యంలో అతడిని నేపాల్ ప్రభుత్వం ఫ్రెంచ్ కు పంపిస్తే మళ్లీ ఏం గొడవలు సృష్టిస్తాడో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.