ఇది నిజంగా షాకింగ్ వార్తే! గంటకు ఏడుగురు విడాకులు తీసుకుంటున్నారు. విడాకులు కోరుతున్నవారిలో భార్యలే అత్యధికంగా ఉండటం విశేషం. అయితే ఇది మనదేశంలో కాదు లెండి. అరబ్ దేశాల్లో భర్తల నుంచి విడిపోతున్న భార్యల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు ది ఎకనామిస్ట్ మ్యాగజైన్ నివేదిక వెల్లడించింది.
ఇన్నాళ్లు ప్రత్యేక సంప్రదాయాలు, నిబంధనలు, కఠిన చట్టాల మధ్య అరబ్ మహిళలు నలిగిపోయారు. ఇప్పుడు వారికి విడాకులకు అవకాశం లభించడంతో వారికి భారీ ఉపశమనం లభిస్తోంది. దాంతో అరబ్ దేశాలలో విడాకుల కేసులు పెరుగుతున్నాయని ది ఎకనామిస్ట్ మ్యాగజైన్ నివేదిక వివరించింది. గత కొద్ది సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు అక్కడ విడాకుల ప్రక్రియ వేగం పుంజుకుందని చెబుతున్నారు.
అరబ్ దేశం ట్యూనీషియాలో ప్రతి నెలా 940 విడాకుల కేసులు నమోదవుతున్నాయి. ప్రతి మూడు గంటలకు నాలుగు జంటలు విడాకులు తీసుకుంటున్నాయి. మరో దేశం అల్జీరియాలోనూ విడాకుల రేటు భారీగా పెరిగింది. ఇక్కడ ఏడాదికి 64 వేల విడాకుల కేసులు చోటు చేసుకుంటున్నాయి. ఇది ప్రతి 12 నిమిషాలకు ఒక విడాకులకు సమానమని నివేదిక తెలిపింది. అలాగే జోర్డాన్‌లోనూ ఏటా 14వేల విడాకుల కేసులు నమోదవుతున్నాయి.
జోర్డాన్, లెబనాన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లలో మూడింట ఒక వంతు వివాహాలు విడాకులతో ముగుస్తున్నాయని నివేదిక తెలిపింది. అలాగే కువైట్‌లో దాదాపు సగం పెళ్లిలు సైతం విడాకులతోనే ముగుస్తున్నాయి. ఇక సౌదీ అరేబియాలో గంటకు ఏడు విడాకులు చోటు చేసుకుంటున్నాయి. సగటున రోజుకు 162 విడాకుల కేసులు నమోదవుతున్నాయని ది ఎకనామిస్ట్ నివేదిక పేర్కొంది.
ఒకప్పుడు విడాకులు తీసుకున్న మహిళలను విమర్శించేవారు. అయితే ఇప్పుడు మహిళ్లలోనూ చదువుకునేవారు పెరుగుతుండటం, తల్లిదండ్రుల ఆలోచనల్లో వచ్చిన మార్పులతో కోర్టుల్లో సంప్రదాయాలను సవాల్ చేస్తున్నారు. మరోవైపు ఆయా దేశాలు విడాకుల చట్టాలను సులభతరం చేశాయి. దాంతో అరబ్ దేశాలలో విడాకుల రేట్లు పెరుగుతున్నాయని నివేదిక వెల్లడించింది. ఈజిప్టులోనూ ప్రస్తుతం మహిళల విడాకుల రేట్లు రెట్టింపు అయ్యాయని నివేదిక షాకింగ్ విషయాలు పేర్కొంది.
సంతోషకరమైన వివాహాలపై కుటుంబాల ప్రభావం తగ్గడం, అలాగే సంప్రదాయ నిబంధనలపై కాకుండా ప్రేమ ఆధారంగా వివాహాలు పెరగడం విడాకుల పెరుగుదలకు కారణాలని నివేదిక వెల్లడించింది.ప్రస్తుతం మొత్తం 22 అరబ్ దేశాల్లోని మహిళలు ఇలా విడాకుల విషయంలో సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు నివేదిక షాకింగ్ విషయాలు వెల్లడించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.