గోదావరిలో పడవ ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. 60 మందికి పైగా బోటులో ప్రయాణించారు. బోటు ఎక్కించుకునే ముందు వారు ఎవరు.? ఐడెంటి ఏంటి? అన్న ఆధారాలు కూడా తీసుకోలేదు. దీంతో బతికి బయటపడ్డ వారి నుంచే ఎవరు గల్లంతయ్యారన్నది తెలుస్తోంది.
తాజాగా తూర్పుగోదావరి జిల్లా దేవీ పట్నం మండలం కచ్చలూరు గోదావరి బోటు ప్రమాదంతో తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ఏడుగురు పోలీసులు బోటులో ప్రయాణించారని తెలిసింది.
ఇక ఇందులో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లో ఏఈలుగా పనిచేస్తున్న ఏడుగురు ఇంజనీర్స్ డే సందర్భంగా సెలవు పెట్టి పాపికొండల టూరుకు వెళ్లారు. వీరిలో ప్రస్తుతం నలుగురు క్షేమంగా బయటపడగా.. ముగ్గురు గల్లంతయ్యారు.
తాజాగా తెలంగాణ పోలీస్ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గల్లంతైన పోలీసులు హేమంత్ (వరంగల్) - తరుణ్ రెడ్డి (నల్గొండ) - సురభి రవీందర్ (హైదరాబాద్)లుగా గుర్తించారు. ఇక ప్రాణాలతో రాజేశ్ - సురేష్ - కిరణ్ కుమార్ - శివకుమార్ లు బతికి బయటపడ్డారు.