వయసు అన్నది పాదరసం అని ఒక మహాకవి అన్నాడు. వయసు అలా సాగిపోతూనే ఉంటుంది. దాన్ని ఆపేది ఎవరితరం కాదు. అయితే వయసుతో వచ్చే ముసలితనాన్ని అనారోగ్యాన్ని ఆపుకునే శక్తియుక్తులు మాత్రం మనిషికి ఉన్నాయి. చెప్పాలీ అంటే టీడీపీ అధినేత చంద్రబాబు సెవెంటీ ప్లస్ గా చెప్పుకోవడం ఒక టెక్నికల్ ఇష్యూనే అని తమ్ముళ్ళు అంటారు. ఆయనతో రాజకీయాన ఈ విషయాన పోటీ పడే వారు టీడీపీలోనే కాదు ఏపీలోనూ దేశంలోనూ లేరని గొప్పగా చెబుతారు.
అయితే ఇపుడు బాబు వయసు గోల అంతా ఎందుకు అన్న ప్రశ్న వస్తోంది. చంద్రబాబు ఏజ్ అందరికీ తెలుసు. అలాగే ఆయన అనుభవం కూడా తెలుసు. అయితే 2024 నాటికి బాబు అనుభవం కంటే వయసు దాన్ని అధిగమిస్తే చిక్కులు వస్తాయా అన్న లెక్కలు అయితే పసుపు శిబిరంలో ఉన్నాయి. చంద్రబాబు ఏజ్ బార్ అయిన నేత అని వైసీపీ ఇక్కడే పసిగట్టి గురి చూసి మరీ బాణాలు వేస్తోంది.
బాబు ఏజ్ అయిపోయింది ఆయన ఇక ఏపీ ప్రజలకు ఏమి సేవలు చేస్తాడు అంటూ వైసీపీ నేతలు కొత్త ఆయుధాన్ని బయటకు తీస్తున్నారు. ప్రస్తుతం బాబు వయసు 72 ఏళ్ళు. మరో రెండేళ్ల తరువాత ఎన్నికలు అంటే ఆనాటికి ఆయన వయసు 74కి చేరుకుంటుంది. అంటే ముఖ్యమంత్రిగా బాబుని జనాలు ఎన్నుకునే నాటికి 75వ పడిలోకి ఆయన అడుగుపెడతారు. నిజానికి మామూలు జనాలకు ఈ ఏజ్ అంటే ఇబ్బందేమో కానీ రాజకీయ నేతలకు కానే కాదని అంటారు. హర్యానా చీఫ్ మినిస్టర్ గా దేవీలాల్ ఎనిమిది పదుల వయసులో బాధ్యతలు చేపట్టారు. అలాగే ఆయన దేశానికి ఉప ప్రధానిగా కూడా చేశారు. ఇక ఎనిమిది పదుల వయసులో దేశానికి మన్మోహన్ సింగ్ ప్రధానిగా చేశారు.
మరి చంద్రబాబు ఇంకా ఏడున్నర పదుల వయసు వారే. పైగా బాబు యంగ్ గా కనిపిస్తారు. ఆయనకు దీర్ఘకాలిక సమస్యలు ఏవీ లేవని కూడా చెబుతారు. అందువల్ల ఈ విషయంలో వైసీపీ ఎంచుకున్న ఆయుధం పనిచేస్తుందా జనాలు దాన్ని నమ్ముతారా అన్నదే చర్చగా ఉంది.
ఇక ఏపీలో చూసుకుంటే ఎలాగైనా సెకండ్ చాన్స్ ని పట్టేయాలని వైసీపీ తాపత్రయపడుతోంది. ఈసారి మిస్ అయితే కష్టమని కూడా ఆలోచన ఉంది. ఇప్పటికే చావు దెబ్బ తిన్న టీడీపీని మరింతగా దెబ్బ కొడితే ఇక మరిన్ని ఎన్నికల దాకా తమకు ఎదురు ఉండదని కూడా భావిస్తోంది. అందుకే దూకుడుగా ఉంటోంది. జగన్ 175 సీట్లు అంటూ టార్గెట్ పెట్టడం వెనక టీడీపీని నైతికంగా దెబ్బతీయడమే లక్షయనా ఉంది అంటున్నారు.
మరో వైపు చంద్రబాబు ఏ మాత్రం కృంగిపోకుండా జనాలలో తిరుగుతున్నారు. ఆయన అన్నింటా ముందు ఉంటున్నారు. వరద ప్రాంతాలలో బురదలో నడచుకుంటూ బాబు జనాలను కలుస్తున్నారు అంటే ఆయన పట్టుదలకు జోహార్ అనాల్సిందే. ఈ నేపధ్యంలో చంద్రబాబుని దెబ్బతీయడానికి ఆయన వయసుని వైసీపీ అస్త్రంగా ఎంచుకుంటోంది అంటున్నారు. బాబు ఏజ్ బార్ అయిందని, ఆయన్ని ఈసారి ఎన్నుకుంటే ఏడున్నర పదుల వయసులో ఏమి పాలిస్తారు అని కూడా అపుడే వైసీపీ నేతలు సెటైర్లు వేయడం మొదలెట్టారు.
బాబు ఇక రిటైర్ కావాలని, ఆయన ఇంట్లో విశ్త్రాంతి తీసుకోవాలని వైసీపీ నుంచి వస్తున్న సూచనలు, కామెంట్స్ విమర్శలు అన్నీ కూడా ప్రణాళికాబద్ధంగానే సాగుతున్నాయని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో యువ ముఖ్యమంత్రి వర్సెస్ సెవెంటీ ప్లస్ బాబు అన్న పోటీని చర్చను జనాల్లోకి తీసుకురావలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. అదే జరిగితే మరి జనాలు ఏ వైపు ఉంటారో చూడాలి.
బాబు తన పరిపాలనా అనుభవం గురించి చెబితే కౌంటర్ గా వైసీపీ ఆయన ఏజ్ ని ప్రస్థావిస్తుంది అని అంటున్నారు. మరి బాబు ఏజ్ బార్ అని జనాలు ఓటేయకుండా ఉంటారా. వారి రియాక్షన్ ఏంటి. బాబు నిజంగా ఇదివరకు మాదిరిగా పాలించలేరా. జనాల్లో ఆయన తిరుగుతున్నపుడు ఆయన చూపించే స్పీడ్ కానీ మాటలలో వేడి కానీ ఆయన నా వయసు పాతికేళ్ళే అంటూ చెబుతున్న మాటలు కానీ జనాలకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇస్తాయా. చూడాలి మరి.