ఏపీని ప‌గ‌బ‌ట్టిన పిడుగులు

Update: 2018-05-14 07:00 GMT
అవును.. ఏపీపై ప్ర‌కృతి క‌న్నెర్ర చేస్తోంది. గ‌డిచిన కొద్దిరోజులుగా ఏపీని అత‌లాకుతులం చేస్తున్నాయి పిడుగులు. ఈ మ‌ధ్య‌నే 24 గంట‌ల వ్య‌వ‌ధిలో ఏపీలోని 11 జిల్లాలో ఏకంగా 36 వేల  పిడుగులు ప‌డ‌టం వాతావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌ల్ని సైతం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. త‌క్కువ వ్య‌వ‌ధిలో ఒక ప్రాంతం మీద‌నే ఫోక‌స్ చేసిన‌ట్లుగా అన్నేసి పిడుగులు ఎలా ప‌డ‌తాయ‌న్న దానికి ఎవ‌రూ స్ప‌ష్ట‌మైన కార‌ణాన్ని చెప్ప‌లేక‌పోతున్నారు.

ఇదిలా ఉంటే.. ఆదివారం కూడా ఇదే సీన్ మ‌రోసారి రిపీట్ అయ్యింది. ఏపీ మీద పిడుగులు ప‌గ ప‌ట్టిన రీతిలో తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డాయి. ఒక్క ఆదివారంలో ఏపీలోని వివిధ జిల్లాల్లో ప‌డిన పిడుగుల కార‌ణంగా 8 మంది మ‌ర‌ణించిన‌ట్లుగా అధికారికంగా వార్త‌లు వ‌స్తున్నారు. మ‌రో ఇద్ద‌రు సైతం పిడుగుల కార‌ణంగా మ‌ర‌ణించిన‌ట్లుగా అన‌ధికార స‌మాచారం.

అధికారిక స‌మాచారం ప్ర‌కారం ఆదివారం ప‌డిన పిడుగుల తీవ్ర‌త‌కు మ‌ర‌ణించిన 8 మందిలో ఒక బాలుడు.. బాలిక‌.. ముగ్గురు యువ‌కులు.  ముగ్గురు పెద్ద వ‌య‌స్కులు ఉన్నారు. చిత్ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఆదివారం వ‌ర్ష ప్ర‌భావం అంత ఎక్కువ‌గా లేకున్నా..భారీగా ప‌డిన పిడుగుల కార‌ణంగా ప‌లు కుటుంబాల్లో విషాదంలో చిక్క‌కుపోయాయి.

మృతుల్లో శ్రీ‌కాకుళం.. విశాఖ‌.. తూర్పుగోదావ‌రి.. క‌డ‌ప జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. భారీ వ‌ర్ష‌పాతం న‌మోదు కాకుండా.. పిడుగుల వ‌ర్షం మాత్రం పెద్ద ఎత్తున ఉండ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News