కేసీఆర్ నిర్ణయంతో వారిలో తీవ్ర అసంతృప్తి..

Update: 2022-01-28 07:52 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతీ సారి ఎవరూ ఊహించని నిర్ణయాలే తీసుకుంటారు. ఆయన నిర్ణయం వెనుక ఎంత గూడార్థం దాగుందో తెలియదు గానీ.. సీఎం నిర్ణయాన్ని మాత్రం బహిరంగంగా ఎవరూ కాదనలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి టీఆర్ఎస్ పార్టీని ఒంటి చేత్తో నడిపించిన కేసీఆర్ గత సంవత్సరం నుంచే వివిధ ప్రాంతాల నాయకులకు బాధ్యతలను అప్పగిస్తున్నారు. మొన్నటి వరకు మండల, గ్రామ కమిటీలను ఏర్పాటు చేయగా... తాజాగా జిల్లా బాస్ లను నియమించారు. కేసీఆర్ సీఎంగ అయినా పార్టీ తన గుప్పిట్లోనే ఉంటుందన విషయం అందరికీ తెలిసింది. కానీ బీజేపీ, ఇతర పార్టీల సంస్థాగత నిర్ణయాలు తీసుకోవడంతో టీఆర్ఎస్ కమిటీల నియామకం చేపట్టక తప్పలేదు. అయితే చివరికి పార్టీకి జిల్లా అధ్యక్షులను నియమించిన కేసీఆర్ పై కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు నుంచి టీఆర్ఎస్ పార్టీకి జిల్లా అధ్యక్షులను నియమించలేదు. ఇటీవల ఒకేసారి 33 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించారు. అయితే జిల్లా అధ్యక్ష పదవులు పొందినవారిలో ముగ్గురు మినహా మిగతా వారందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీచైర్ పర్సన్లు ఉన్నారు. అంతే ఇప్పటికే పదవులు ఉన్నవారికి జిల్లా అధ్యక్ష పదవులను అప్పజెప్పారు. అయితే పార్టీని పట్టుకొని.. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరి...ఎదురుచూస్తున్న వారికి కేసీఆర్ నిర్ణయం తీవ్ర నిరాశ మిగిల్చింది. ఇప్పటి వరకు ఒక్క పదవి కూడా పొందలేని వారు పార్టీలో ఎంతో కాలం నుంచి ఉంటున్నట్లు సమాచారం. అయితే పార్టీ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు నేతలు చెబుతున్నారు.

ఇక ఒక ఎమ్మెల్యేకు జిల్లా అధ్యక్ష పదవి అప్పగించడం వల్ల ఆయన మరో ఎమ్మెల్యేపై అజామాయిషీ చేయగలడా..? అనే ధోరణి వినిపిస్తోంది. ఇక మంత్రులు ఉన్న జిల్లాలో ఎలా ముందుకు వెళ్తుందోనని చర్చించుకుంటున్నారు. అయితే తమకు ఎప్పటికైనా ఏదో ఒక పదవి వస్తుందని పార్టీని పట్టుకొని ఉన్నవారికి జిల్లా అధ్యక్ష పదవుల నియామకంతో ఇక నిరాశే మిగిలింది. ఎందుకంటే ఇప్పట్లో ఇక పార్టీ కమిటీలను నియమించే అవకాశం లేదు. దీంతో పార్టీ నుంచి ఏ పదవి ఆశించినా లాభం లేదని కొందరు నిట్టూర్చుతున్నారు.

అయితే ఆర్థికంగా బలమున్న వారికే  జిల్లా అధ్యక్ష పదవులు అప్పగించారని అంటున్నారు. కానీ జిల్లా స్థాయిలో ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారని, అందుకే అలాంటి పోస్టుల్లో ఉన్నవారికి ఈ పదవులు కట్టబెట్టారని అంటున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. అంతేకాకుండా ప్రతి పక్ష బీజేపీ, కాంగ్రెస్ లను తిప్పటికొట్టే సమర్థత ఉన్నవారినే నియమించారని కొందరు పార్టీ నేతలు అంటున్నారు. కానీ కొందరు కార్యకర్తలు మాత్రం ఇన్నాళ్లు వేచి చూసినా తమకు నిరాశే ఎదురైందని ఆవేదన చెందుతున్నారు. మరి అలాంటి వారిని కేసీఆర్ ఎలా బుజ్జగిస్తారో చూడాలి..
Tags:    

Similar News