ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు.త్రిపుల్ తలాక్ విషయంలో బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. త్రిపుల్ తలాక్ సంగతి కాసేపు పక్కన పెట్టి తన భార్య సంగతి ముందు తేల్చాలని మోదీకి ఆయన సవాల్ విసిరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను దుయ్యబట్టారు. ఆదివారం రాత్రి ఓ చానెల్ లో ప్రసారం కానున్న కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సీఎం కేసీఆర్ తన వాక్ చాతుర్యంతో ప్రజలను మభ్యపెడుతున్నారని షబ్బీర్ అలీ అన్నారు. కేసీఆర్ తన మాటల గారడీతో అబద్ధపు హామీలను ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. విపక్ష నేతలను కేసీఆర్ సన్నాసులు అంటుంటారనీ, తాము కూడా అదే మాటను తిరిగి అనగలమన్నారు. ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చడం ఇష్టం లేక తాము అలా అనడం లేదరన్నారు. కాంగ్రెస్ నేతలను తిట్టే అంశాన్ని కేసీఆర్ విజ్ఞతకే వదిలేశామంటున్నారు. 2019లోగా టీఆర్ ఎస్ లో చేరతారనీ, డిప్యూటీ సీఎం అవుతారన్న వదంతులను షబ్బీర్ అలీ ఖండించారు.
కాంగ్రెస్ పార్టీపై కూడా షబ్బీర్ అలీ విమర్శలు చేశారు.తమ పార్టీలో ఎవరు నాయకుడు.. అనే అంశంపై వాదులాడుకుంటున్నారన్నారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ను విలీనం చేయాలంటే.. తనను సీఎం చేయాలని కేసీఆర్ అడిగారని ఆయన వివరిస్తున్నారు. అయితే ఆ ప్రతిపాదన ఎందుకు ఫలించలేదో అధిష్టానానికే తెలియాలన్నారు. అధికారంలో ఉన్నవారితో మంచిగా ఉండాలనేది ఎంఐఎం సిద్ధాంతమన్నారు.
వ్యక్తిగతంగా తాను త్రిపుల్ తలాక్ కు వ్యతిరేకమని షబ్బీర్ తేల్చిచెప్పారు. త్రిపుల్ తలాక్ సంగతి కాసేపు పక్కన పెట్టి తన భార్య సంగతి ముందు తేల్చాలని మోదీకి ఆయన సవాల్ విసిరారు. తన వ్యక్తిగత, రాజకీయ అంశాలపై ఎన్నో విషయాలను ఆయన ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.