కాంగ్రెస్ నేతల రూటే సపరేటు.. సీనియర్లు డెడ్ బాడీస్ ?

Update: 2019-11-06 06:15 GMT
కాంగ్రెస్ పార్టీ కి దేశ చరిత్రలో ఎంతో ఘనమైన కీర్తి ఉంది. ప్రస్తుతం ఇతర పార్టీలలో కీలక నేతలుగా , దేశ ప్రజలతో కీర్తింపబడుతున్న నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఓనమాలు నేర్చుకున్నవారే. కాంగ్రెస్ పార్టీ పడిపోయింది అనుకున్న ప్రతిసారి కూడా ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటంలా దూసుకుంటూ పైకి లేచి వచ్చేది. తెలుగు రాష్ట్రాలు విడిపోక ముందు వరుసగా టీడీపీ అధికారంలోకి వస్తున్న సమయంలో కాంగ్రెస్ పని అయిపోయింది అని ఎంతోమంది అన్నారు. కానీ , ఆనాడు వై ఎస్ ఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి కాంగ్రెస్ కి పూర్వ వైభవం తీసుకువచ్చాడు.

ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాలతో తెలుగు రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోయింది. అసలు తెలంగాణ నేతలు కోరిన విధంగా తెలంగాణని ప్రత్యేక రాష్ట్రంగా చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే కానీ , అదే విషయాన్ని ప్రజలలోకి తీసుకోని వెళ్లలేక తెలంగాణ లో .. రాష్ట్రాన్ని చీల్చింది అన్న అపవాదతో ఏపీలో అధికారానికి దూరమైంది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది అని ప్రజలు ఎప్పుడో మరచిపోయారు. ఇక తెలంగాణ లో ప్రధాన ప్రతిపక్షం గా ఉన్న కాంగ్రెస్ .. పార్టీలోని కీలక నేతల వ్యవహార శైలి తో ఆ పార్టీ పరువు మసకబారుతోంది. ముఖ్యంగా తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ ముందుకు రాకపోవడానికి కారణం పార్టీలో ఉన్న అంతర్గత కలహాలే అని అందరికి తెలిసిందే. ఇదే విషయం మరోసారి బయటపడింది. అది కూడా  జాతీయ నాయకుడు గులాం నబీ ఆజాద్ సమక్షంలో టీ కాంగ్రెస్ లో ఉన్న కలహాలు బయటపడ్డాయి.

తెలంగాణ  కాంగ్రెస్ పార్టీలో కొత్తగా కుదిరిన సమీకరణలు, దోస్తీలు కాక రేపుతున్నాయి. ఇంతకీ గులాం నబీ ఆజాద్ రాకతో ఎందుకు వివాదం రగిలింది. నిజానికి ఆజాద్ ఎప్పుడొచ్చాడన్నదే వివాదానికి నాందీ ప్రస్తావన. ఆజాద్ రాకతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసాగా మారడానికి ఆజాద్ పర్యటనే కారణమైంది. సమావేశానికి హాజరైన సీనియర్ నేత వి.హనుమంతరావు ముందుగా ఆజాద్ పర్యటనకు సంబంధించి తనకెందుకు సమాచారం ఇవ్వలేదని మాజీ మంత్రి షబ్బీర్ అలీని నిలదీయడంతో ఈ వివాదాం మొదలైంది. ఆజాద్ జాతీయ నాయకుడు ఆయన రాక సీనియర్లకు తెలపాల్సి వుందంటూ.. కొత్తగా వచ్చిన వారు సీనియర్లను విస్మరిస్తున్నారని వాదించారు.

విహెచ్ కామెంట్లతో  ఒక్కసారిగా రెచ్చిపోయిన  షబ్బీర్ అలీ సీనియర్లంతా ఒక రకంగా డెడ్ బాడీస్ అంటూ వృద్ధ నేతలు పార్టీకి భారమన్నట్లు మాట్లాడారు. దీనితో ఆజాద్ సమక్షంలోనే విహెచ్ రెచ్చిపోయారు. తన సమక్షంలోనే ఈ నేతలిద్దరూ బూతులు తిట్టుకోవడంతో ఆయన మౌనంగా వుండిపోయినట్లు సమాచారం. దీనితో కొంతమంది నేతలు చెప్పడంతో అలీ మౌనం గా ఉన్నా ..విహెచ్ మాత్రం కోపం తో అలిగి అక్కడినుండి వెళ్లిపోయారు. అలాగే మీడియా తో మాట్లాడుతూ ..గొడవ జరిగింది నిజమే మీకు అనిపించింది రాసుకోండి అని చెప్పారు. అలాగే ఇదే సమావేశంలో   టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై  కూడా విహెచ్ ఘాటైన కామెంట్లు చేశారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఆర్.ఎస్.ఎస్. రక్తమని, ఆయనతో షబ్బీర్ గ్రూపు కడుతున్నాడని విహెచ్ ఆరోపించారని కొందరు నేతలు మాట్లాడుకుంటున్నారు.
Tags:    

Similar News