కేసీఆర్ పెద్ద లోఫ‌ర్‌..కేటీఆర్ చిన్న లోఫ‌ర్‌: షబ్బీర్

Update: 2018-02-09 07:39 GMT
తెగించ‌డానికి కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు ఉన్న‌న్ని అవ‌కాశాలు ఇంకెవ‌రికీ ఉండ‌వు. చాలాకాలం త‌ర్వాత వారిని అధిగ‌మించిన నేత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌. ఎన్నిక‌ల‌కు ముందు, ఉద్య‌మంలో వారిని ఎంత ఆడుకున్నాడో అంద‌రూ చూసిందే. అయితే, ముఖ్య‌మంత్రి అయ్యాక మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి ప్ర‌త్యేకంగా కాంగ్రెస్ ను తిట్టేవాడు. ఇటీవ‌లే ఫ‌స్ట్ టైం.. కాంగ్రెస్ ను తిట్ట‌డానికి  ఆయ‌న కుమారుడు కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ దాడి చేశాడు. ఏకంగా కాంగ్రెస్ ను లోఫ‌ర్ పార్టీ అన్నాడు కేటీఆర్‌.

దీనికి కాంగ్రెస్ నుంచి రివ‌ర్స్ అటాక్ గట్టిగానే మొద‌లైంది. అటాక్ తోనే ఆప‌కుండా అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఎన్నిక‌ల తాయిలం కూడా ప్ర‌క‌టించారు కాంగ్రెస్ పార్టీ నేత‌లు. పెద్ద లోఫ‌ర్ రాష్ట్రాన్ని పాలిస్తుంటే... చిన్న లోఫ‌ర్ అవినీతితో తెలంగాణ‌ను దోచుకుంటున్నాడ‌ని కాంగ్రెస్ నేత ష‌బ్బీర్ అలీ విరుచుకుప‌డ్డారు. అస‌లు లోఫ‌ర్ ప‌నులు ఎవ‌రు చేశారో గ‌త చ‌రిత్ర త‌వ్వితే తెలుస్తుంది. పాస్‌పోర్టు ఏజెంటుగా ప‌నిచేసిన వ్య‌క్తి కేసీఆర్‌. మ‌రి లోఫ‌ర్ ఆయ‌న కాక ఇంకెవ్వ‌రు అని ష‌బ్బీర్ అలి ధ్వ‌జ‌మెత్తారు.

తెలంగాణ స‌మాజంలో కేసీఆర్ పాల‌న‌పై అస‌హ‌నం పెరిగిపోయింద‌ని, ద‌ళితుడి కంటే బాగా పాలిస్తాన‌ని గ‌ద్దెనెక్కిన‌ కేసీఆర్ త‌న అస‌మ‌ర్థ‌త‌ను చాటుకుని తెలంగాణ‌ను అప్పుల‌పాలు చేశాడ‌ని ష‌బ్బీర్ అలీ వ్యాఖ్యానించాడు. ప‌ల్లెకు వెళ్తే వీరిపై జ‌నానికి ఎంత కోప‌ముందో తెలుస్తుంద‌న్నారు. టీఆర్ఎస్‌పై దాడి చేస్తూనే కాంగ్రెస్ త‌ర‌ఫున ష‌బ్బీర్ అలీ భారీ హామీ ఇచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలిస్తే రూ.2 ల‌క్ష‌ల రూపాయ‌లు రుణ‌మాఫీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఇటీవ‌ల కేసీఆర్ ప్ర‌భుత్వం సోష‌ల్ మీడియాలో వ్య‌క్తిగ‌త దూష‌ణ‌కు దిగితే ఎవ‌రినైనా అరెస్టు చేసేలా ఒక చ‌ట్టం చేయాల‌ని నిర్ణ‌యించింది. ప‌రుష ప‌ద‌జాలం వాడ‌టం నేరంగా ప‌రిగ‌ణించింది. శుద్ధులు చెప్పే వాళ్లు దీనిని పాటిస్తే జనానికి చ‌ట్టాల‌పై గౌర‌వం ఉంటుంది. ఏకంగా మంత్రి ప్రెస్ మీట్ పెట్టి లోఫ‌ర్‌ - దుర్మార్గుడు అని ప్ర‌తిప‌క్ష నేతల పేర్లు చెప్పి వ్య‌క్తిగ‌త దూష‌ణ‌కు దిగిన‌పుడు సోష‌ల్ మీడియాలో దూష‌ణ‌పై చ‌ట్టం తీసుకురావ‌డం ఏ విధంగా క‌రెక్టో మంత్రిగా కేటీఆర్ వివ‌ర‌ణ ఇవ్వాలి. జ‌నానికి నీతులు చెప్పే నేత‌లు ప్ర‌జ‌లు మాత్రం గౌర‌వంగా మాట్లాడాల‌ని చ‌ట్టాలు చేయ‌డం ఎంత దౌర్భాగ్యం?!

Full View
Tags:    

Similar News