షారుఖ్ కొడుకు ఆర్యన్ కు 14రోజుల రిమాండ్

Update: 2021-10-07 16:30 GMT
ముంబైలోని క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ పార్టీ చేసుకొని దొరికిపోయిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మరింత చిక్కుల్లో పడ్డాడు. ఆర్యన్ తోపాటు మొత్తం 8మందిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ తాజాగా విచారణ అనంతరం కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో కోర్టు ఆర్యన్ ఖాన్ సహా 8మంది నిందితులను 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీకి పంపింది. ఎవరినీ అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం లేదని.. విచారణకు ఎన్సీబీకి తగినంత సమయం .. అవకాశం ఇచ్చామని కోర్టు తెలిపింది. దీంతో ఆర్యన్ ఖాన్ సహా ఇతరుడు జ్యూడీషియల్ కస్టడీకి పంపించారు.

కోర్టులో సమర్పించిన రిమాండ్ నివేదిక ఆధారంగా నిందితుల కస్టడీని ఎన్సీబీ కోరింతి. ఎన్సీబీ కస్టడీలో ఉన్నప్పటి నుంచి కోర్టుకు హాజరయ్యే వరకూ ఏమీ దర్యాప్తు చేయలేదు. కానీ ఎన్సీబీ సరిగ్గా విచారణ చేయడం కోసం సమయం కావాలని కోరింది. రిమాండ్ రిపోర్టు అసంపూర్తిగా ఉండడంతో కస్టడీ పొడిగించమని చెబుతూ మొత్తం 8 మంది నిందితులను జ్యూడీషియల్ కస్టడీకి కోర్టు పంపింది.

రాత్రి 7 గంటలకు తీర్పు రావడంతో జైలు సమయం దాటిపోయింది. దీంతో నిందితులను ఎన్సీబీ కార్యాలయం లాకప్ లో రాత్రి గడపాల్సి ఉంటుంది. ఇక్కడే జ్యూడీషియల్ కస్టడీగా తీసుకుంటున్నారు. ఎన్సీబీ లాకప్ లో ఆర్యన్ కుటుంబాన్ని కలవడానికి కోర్టు అనుమతించింది.

ప్రముఖ న్యాయవాది సతీష్ మన్ షిండే ఆర్యన్ కేసు టేకప్ చేశారు. ఆర్యన్ ఖాన్ జ్యూడీషియల్ కస్టడీకి పంపించిన వెంటనే కోర్టులో రెండు బెయిల్ పిటీషన్లు వేశాడు. తక్షణ బెయిల్ పొందడానికి ఒక మధ్యంతర బెయిల్ అలాగే..రెగ్యులర్ బెయిల్ కూడా దరఖాస్తు చేశారు. కోర్టు బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తు జరిగే వరకూ ఆర్యన్ ఖాన్ బెయిల్ పై ఉంటారు. బెయిల్ పిటీషన్ శుక్రవారం ఉదయం విచారణకు రానుంది.

కోర్టు 14 రోజులు ఆర్యన్ ఖాన్ ను జ్యూడిషియల్ రిమాండ్ విధించామని తీర్పు ఇచ్చేసరికి షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజ కోర్టులోనే ఏడవడం కనిపించింది. ఆర్యన్ ఖాన్ ఆర్యన్ ఖాన్ బంధువు అని చెప్పి పర్మిషన్ తీసుకొని వారు ఇద్దరూ మాట్లాడుకునే ఏర్పాటు చేశారు. ఇక ఈ రాత్రికి షారుఖ్ కుటుంబ సభ్యులు కలిసే అవకాశం ఉందని అంటున్నారు.





Tags:    

Similar News