సంచలన వీడియో.. ఢిల్లీలో అల్లర్లు సృష్టించడానికి డబ్బుల పంపకం

Update: 2020-03-03 07:15 GMT
మూడు రోజులు దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతం లో హింసాత్మక ఘటనలు జరిగి ప్రజల ఆస్తులకు తీవ్ర నష్టం రాగా.. కొందరి ప్రాణాలు గాల్లో కలిశాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకులు, అనుకూలుర మధ్య రేగిన వివాదం ఏకంగా అల్లర్లకు దారితీసి చివరకు హింసాత్మకంగా మారాయి. అయితే ఇవి కుట్రపూరితంగా, పక్కా ప్లాన్ తో జరిగాయని వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ పర్యటన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అప్రతిష్ట తీసుకురావడం, సీఏఏ ప్రభావం తో ఇలాంటి పరిణామాలు ఉంటాయని చెప్పేందుకు తదితర అంశాలతో ఈ దాడులు చెలరేగాయని తెలుస్తోంది. అయితే ఈ దాడులు పక్కాగా ప్లాన్ తో, కొందరు ఉద్దేశ పూర్వకంగానే చేసినట్లు సమాచారం. వాటికి బలం చేకూరుస్తూ సోషల్ మీడియా లో ఓ వీడియో వైరలవుతోంది.

ఢిల్లీలోని ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు సృష్టించడానికి.. దాడులు చేయడానికి డబ్బులు పంచుతున్నట్లు 30 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో ఉంది. ఆ వీడియో లో కొందరు ముస్లిం వ్యక్తులు నిలబడి డబ్బులు పంచుతుండగా ముస్లిం మహిళలు తమ చిన్నారులతో సహా తీసుకోవడానికి బారులుతీరారు. డబ్బులు తీసుకుని వారికి ఏదో సూచిస్తున్నది కనిపిస్తోంది. 'ఇతరులకు సాయం చేస్తున్న వీళ్లకు అల్లా ఇంకా చాలా ఇస్తారు' అని ఓ మహిళ పేర్కొంది. ఇదంతా ఢిల్లీలోని న్యూ ముస్తఫాబాద్‌లోని బాబూనగర్‌ లో ఉన్న నాలుగో నంబర్ వీధిలో చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరే అల్లర్లలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

అయితే వారికి డబ్బులతో పాటు పెద్ద ఎత్తున భోజనాలు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున వంటకాలు చేసిన ఫొటోలు కూడా కనిపిస్తున్నాయి. ఈ వీధిలోనే కాదు, మిగతా వీధుల్లోనూ ఇది చేశారని తెలుస్తోంది.తుగ్లకాబాద్ మొదలుకొని, దిల్లీలోని వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్లు ఈ విధంగా చేసి అల్లర్లకు ప్రోత్సాహం ఇచ్చినట్లు తెలుస్తోంది. నిరాశ్రయులై ఇక్కడుంటున్నవాళ్లకు డబ్బులు పంచి, భోజనం పెట్టడంతో వారంతా ఆ మూడు రోజులు బీభత్సం సృష్టించారని పోలీస్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. అయితే ఆ వీడియోను చూసిన కొందరు అది అల్లర్ల కోసం పంచుతున్నది.. కాదు. అల్లర్లలో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు డబ్బులు పంచుతున్నట్లు కూడా చెబుతున్నారు. మరి వాస్తవమేమిటో పోలీసులే నిర్ధారించాల్సి ఉంది.
Tags:    

Similar News