జగన్ మదిలో ప్రొటెం స్పీకర్ ఈయనేనట..

Update: 2019-06-05 05:34 GMT
ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జగన్ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అధికారుల బదిలీల దగ్గర నుంచి సంక్షేమ పథకాలపై సమీక్షల వరకు ప్రక్షాళన చేస్తున్నారు. ఇక 8న మంత్రివర్గ ప్రమాణ స్వీకారం.. 12న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమైంది.

కాగా ముందుగా ప్రొటెం స్పీకర్ ను ఎన్నుకోనున్నారు. సభలోనే సీనియర్ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్ చేస్తారు. ఆ తరువాత ఆయన ఎమ్మెల్యేలందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక ప్రొటెం స్పీకర్ తో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించడం ఆనవాయితీగా వస్తోంది.

కాగా ప్రస్తుతం వైసీపీ సీనియర్ నేతలలో ఒకరిని ప్రొటెం స్పీకర్ ను చేయడానికి జగన్ రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - బుచ్చయ్య చౌదరిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే వీరితోపాటు ప్రముఖంగా చిన్న అప్పల నాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. విజయనగరం జిల్లాకు చెందిన ఈ సీనియర్ నేతకు ప్రొటెం స్పీకర్ ను చేస్తారని వైసీపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈయన నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ పదవి వరిస్తుందని అంటున్నారు..

ప్రొటెం స్పీకర్ గా మరికొందరి పేర్లు కూడా పరిశీలనలోకి వస్తున్నాయి. ఇందులో బుచ్చయ్య చౌదరి - రామచంద్రారెడ్డి - చంద్రబాబులు కూడా అసెంబ్లీ సీనియర్ పొలిటిషియన్లు. అయితే వీరు ప్రొటెం స్పీకర్ చేయడానికి ఒప్పుకోవడం కష్టమే. అందుకే మరో సీనియర్ అయిన శంబంగి చిన్న అప్పలనాయుడికి అవకాశం దక్కనుందని సమాచారం.
Tags:    

Similar News