కొద్దిమంది ఎమ్మెల్యేలు తరచూ వార్తల్లో కనిపిస్తుంటారు. అయితే.. పార్టీకి ఇబ్బందికరం కానంత వరకూ ఓకే. కానీ.. కొందరు ప్రజాప్రతినిధుల వైఖరి వివాదాస్పదంగా మారటం పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే.. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కారణంగా ఏర్పడుతుందన్న వాదన వినిపిస్తోంది.
మొన్నటికి మొన్న జిల్లా కలెక్టర్ పట్ల అనుచితంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహాన్ని చవి చూసిన ఆయన.. తాజాగా మరోసారి తనదైన శైలిలో వ్యవహరించి వార్తల్లోకి ఎక్కటం గమనార్హం. మండల మెజిస్ట్రేట్.. తహసీల్దార్ సీట్లో కూర్చొని కిందిస్థాయి అధికారులతో ఆయన వ్యవహరించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకూ ఏం జరిగిందన్న అంశంపై అక్కడి స్థానికులు చెబుతున్న సమాచారం ప్రకారం ఎమ్మెల్యే శంకర్ నాయక్ గూడూరు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. ఎమ్మెల్యే వెళ్లిన సమయానికి తహసీల్దార్ కార్యాలయంలో లేరు. ఆ సమయంలో తహసీల్దార్ రాజు మట్టెవాడ శివారు నేలవంచ గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామసభలో పాల్గొనటానికి వెళ్లారు.
కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే తహసీల్దార్ సీట్ లో కూర్చున్నట్లు చెబుతున్నారు. అనంతరం అధికారి ఎక్కడకు వెళ్లారని అడిగారు. తనకు అనుకొని మరో తహసీల్దార్‌కు ఫోన్ చేసి తాను కార్యాలయానికి వస్తున్నట్లుగా చెప్పారని.. తనకు ఫోన్ చేయలేదని గూడూరు తహసీల్దార్ రాజు వెల్లడించారు. ఎమ్మెల్యే తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన వ్యవహరించిన తీరుపై ఆర్డీవోకు.. కలెక్టర్ ప్రీతిమీనా దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు. ఒకటి తర్వాత ఒకటిగా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న ఎమ్మెల్యే తీరు టీఆర్ ఎస్ వర్గాల్లో విస్మయాన్ని రేకెత్తిస్తోంది.