అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారితో ముఖ్యనేతలు భేటీ అయ్యాక.. వారు చేసే వ్యాఖ్యలు రెగ్యులర్‌కు భిన్నంగా ఉంటాయి. విడి సమయాల్లో విమర్శలు చేసినా.. ముఖ్యనేతల్ని కలిసిన తర్వాత మాత్రం.. తామేం చెప్పామో చెప్పి.. సదరు కీలక నేత రియాక్షన్‌ను చెబుతుంటారు. కానీ.. తాజాగా ఎన్సీపీ.. అదేనండి నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు.
ఈ మధ్యనే ఆయన.. ప్రధాని మోడీని కలిశారు. మహారాష్ట్ర రైతుల వ్యవసాయ రుణాల్ని మాఫీ చేయాలని కోరారు. అయితే.. ఆయన కోరికపై ప్రధాని ఎలా రియాక్ట్ అయ్యారో కానీ.. తాజాగా మీడియాతో మాట్లాడిన పవార్ మాత్రం సమకాలీన రాజకీయాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయటం గమనార్హం. దేశ రాజకీయాల్లో దుష్టపరిణామాలు పెరిగి పోతున్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు.
కేంద్రంలో బీజేపీ సర్కారుతో ఎలాంటి ప్రయోజనం లేదని.. దేశానికి ఒరిగిందేమీ లేదని చెప్పిన ఆయన.. మూడేళ్ల బీజేపీ పాలనలో వ్యవసాయ రంగాల వృద్ధి క్షీణించిందని మండిపడ్డారు. అంతేనా.. ఉపాధి కల్పన సైతం కనీస స్థాయిలో లేదని ఆయన చెప్పటం గమనార్హం. ఇదతా ఒక ఎత్తు అయితే.. పవార్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ మిత్రపక్షంగా ఉంటూ.. అప్పుడప్పుడు తన మాటలతో కమలనాథులకు షాకులిస్తున్న శివసేన పవార్ పేరును అత్యుత్తమ పదవికి పోటీ అభ్యర్థిగా తెర మీదకు తెచ్చారు. అయితే.. తనకు రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగాలన్న ఆలోచన లేనట్లుగా పవార్ స్పష్టం చేశారు. తనకు బదులు వేరే వారిని చూసుకోవాలని పవార్ స్పష్టం చేశారు. మోడీ సర్కారుపై నిప్పులు చెరుగుతున్న ఆయన.. రాజకీయాల మీద నిర్వేదంతో మాట్లాడటం వెనుక మర్మమేందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/