కేంద్ర మాజీమంత్రి , రాజకీయ కురువృద్ధుడు, ఎన్ సీపీ అధినేత శరద్ పవార్ అనారోగ్యానికి గురయ్యారు. పొత్తికడుపులో నొప్పి కారణంగా అసౌకర్యానికి గురైన ఆయన్ను ఆదివారం సాయంత్రం ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్ సీపీ అధినేత శరద్ పవార్ నిన్న సాయంత్రం పొత్తికడుపులో నొప్పితో ఇబ్బందిపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు..గాల్ బ్లాడర్ లో ఆరోగ్య సమస్య ఉందని తెలిపారు అని మాలిక్ ట్వీట్ చేశారు
బుధవారం ఆయనకు శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉందన్నారు. గతంలో ఆయన క్యాన్సర్ సైతం జయించారు. తదుపరి సమాచారం అందేవరకు,ఆయనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు రద్దయ్యాయని వెల్లడించారు. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ చేసిన 100 కోట్ల రూపాయల కలెక్షన్ ఆరోపణలను ఎదుర్కొంటోన్న మహారాష్ట్ర హోమ్ శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ , ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యే. ఆయనకు మద్దతుగా ఇటీవలే శరద్ పవార్ మీడియాతో మాట్లాడారు. పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ పెద్ద ఎత్తున అనిల్ దేశ్ ముఖ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు వ్యతిరేకంగా ప్రచారాన్ని చేపడుతున్నారు. ఈ పరిస్థితుల మధ్య శరద్ పవార్.. అహ్మదాబాద్ లో అమిత్ షాతో భేటీ కావడం పలు చర్చలకు దారితీసింది.