కేసీఆర్ సీటులోనే ఎసరు పెడుతున్న వైఎస్ షర్మిల!

Update: 2021-08-30 10:45 GMT
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల తన కార్యాచరణ మొదలుపెట్టింది. నిరుద్యోగ యువత కోసం తన తొలి అడుగులు వేస్తోంది. కేసీఆర్ సర్కార్ పై పోరుబాట పట్టింది. తెలంగాణలోని నిరుద్యోగ యువతకు వెన్నుదన్నుగా నిలిచేందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరుఫున నడుం బిగించింది.

తెలంగాణలో నీళ్లు, నిధులు పూర్తయిన నిరుద్యోగుల ఆశలు మాత్రం నెరవేరలేదు. ఉద్యోగం లేక నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నయువతకు భరోసా కల్పించేందుకు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీక్షలకు దిగుతున్నారు. ఇక నుంచి ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నట్లు వైఎస్ షర్మిల తెలిపారు.

ఇప్పటిదాకా తెలంగాణలోని అన్ని జిల్లాలను కవర్ చేసిన షర్మిల తాజాగా కేసీఆర్ సీటులోనే దీక్షకు దిగారు. రేపు మంగళవారం సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో షర్మిల దీక్షకు దిగుతుండడం సంచలనమైంది. సాధారణంగా సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో ఆయనకు ఎదురు వెళ్లేందుకు ఎవరూ సాహసించరు. అలాంటిది షర్మిలకు సహకరిస్తూ ఆమె దీక్షకు అండగా నిలిచిన ఆ నిరుద్యోగి కుటుంబ ఎవరన్నది ఆసక్తి రేపుతోంది.

కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని అనంతరావుపల్లిలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేయనున్నారు. అనంతరం ఇటీవల ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్న కొప్పురాజు కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు.

ఈ మేరకు గజ్వేల్ వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలు దీక్షకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కాగా ఆమె ఏకంగా సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్  లోనే దీక్షకు దిగుతుండడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
Tags:    

Similar News