చెప్పాల్సిన మాటల్ని సూటిగా చెప్పేయటం.. ముఖం పగిలే పంచ్ లాంటి మాటలు మాట్లాడటంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిలకు సాటి రారెవ్వరూ. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆమె.. బస్సు యాత్ర చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండిలో నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడారు.
నిప్పులు చెరిగే ఎండలో.. పోటెత్తిన జనసందోహాన్ని ఉద్దేశించి ఆమె చంద్రబాబు పైనా.. లోకేశ్ మీదా నిప్పులు చెరిగారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయని చంద్రబాబుకు ఓటెందుకు వేయాలన్న ప్రశ్నతో పాటు.. బాబు పాలనలో చోటు చేసుకున్న ఆరాచకాల్ని ఒక్కొక్కటిగా వివరించారు. బాబు చేసిన తప్పుల్ని వరుసగా చెబుతున్న షర్మిల ప్రసంగానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.
షర్మిల ఘాటు ప్రసంగంలోని ముఖ్యంశాల్ని చూస్తే..
+ ‘ఐదేళ్లలో మహిళల కోసం ఏమి చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి నేను మీ అన్నను. మీరు నా అక్కాచెల్లెళ్లు. నాకు ఓటెయ్యండి అని అడుగుతున్నారు. అన్నా అంటే ఎవరు? తోబుట్టువుకి తోడుగా ఉండేవాడే అన్న. అక్కచెల్లెకి కష్టకాలంలో తోడుగా ఉండేవాడు అన్న. ఇచ్చిన మాట తప్పని వాడే అన్న.
+ ఐదేళ్ల అయింది రుణమాఫీ చేస్తానని చెప్పి.. ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా మాఫీ చేయని వాడు అన్న అవుతాడా? వనజాక్షి చంద్రబాబుకు చెల్లెలు లాంటిది కాదా? నడిరోడ్డున టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జుట్టు పట్టుకొని రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. అప్పుడు ఏమైంది చంద్రబాబులోని అన్న. చచ్చిపోయాడా? మళ్లీ నిస్సిగ్గుగా అదే చింతమనేనికి టికెట్ ఇచ్చారు.
+ రిషితేశ్వరి కాలేజీ విద్యార్థి చంద్రబాబుకు చెల్లి కాదా? చంద్రబాబు మనిషి అయిన బాబురావు మనిషి వల్ల ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు చంద్రబాబులోని అన్న చచ్చిపోయాడా? ఇప్పుడు వచ్చి ఓట్లు వేయండి అని మహిళలను అడిగితే ఎవరు నమ్ముతారు?
+ ఒక ముఖ్యమంత్రి ఎలా ద్రోహం చేయకూడదో ఈ ఐదేళ్లలో చంద్రబాబు మనకు చూపించారు. రైతు రుణమాఫీ అంటూ చేసిన మొదటి సంతకానికే దిక్కులేదు. డ్వాక్రామహిళలకు రుణమాఫీ చేస్తానన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఐదేళ్లు ఏమి చేయకుండా పసుపు కుంకుమ అంటూ భిక్షం వేస్తున్నట్లు ఇస్తున్నారు. ఎంగిలి చేయి విదిలిస్తున్నారు. అక్కా చెల్లెళ్లు మోసపోకండమ్మా. కేవలం మహిళలను మభ్యపెట్టడానికి చంద్రబాబు డబ్బులు ఇస్తున్నారు.
+ అక్వా కల్చర్ ప్రాసెసింగ్ యూనిట్ వల్ల కాలుష్యం కలుగుతుందని మహిళలు ఆందోళన చేస్తే వాళ్లను పోలీసులతో కొట్టించి జైల్లో పెట్టించారు. అప్పుడు ఈయనలోని అన్న చచ్చిపోయాడా? అంగన్ వాడి మహిళలు జీతాలు సరిపోవడం లేదని ధర్నాలు చేస్తే లాఠీచార్జీ చేయించారు. జైల్లో పెట్టించారు. అప్పుడు ఈయనలోని అన్న చచ్చిపోయాడా?
+ మధ్యాహ్నం భోజనం స్కీంలో ఆడవాళ్లు పనిచేస్తుంటే వాళ్ల ఉద్యోగాలు తీసేస్తామని చంద్రబాబు అంటే ఆ మహిళలు ధర్నాలు చేశారు. అప్పుడు లాఠీఛార్జీ చేసి మహిళలను జైల్లో పెట్టించారు. అప్పుడు ఆయనలోని అన్న చనిపోయాడా? చంద్రబాబు లాంటి అన్న ఉంటే అంతకు మించిన దురదృష్టవంతురాలే ఉండదు.
+ కేంద్ర ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క బిల్డింగ్ కట్టలేదు. ఏమైంది ఆ డబ్బంతా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు పెట్టిస్తాడట. ఐదేళ్లు సీఎంగా ఉండి అమరావతి ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టలేదు కానీ ఇంకో ఐదేళ్లు ఇస్తే అమెరికాను అమెరికా చేస్తారట. మన చెవిలో పూలు పెడతాడట.
+ చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేస్తూ కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుంటున్నామని ఆరోపిస్తున్నారు. మాకు ఎవరితో పొత్తు అవసరం లేదు. సింహం సింగిల్ గానే వస్తుంది. నక్కలే గుంపులుగా వస్తాయి. అందుకే చంద్రబాబు కాంగ్రెస్ - జనసేనతో కలిసి వస్తున్నారు. ఏ పొత్తు లేకుండా చంద్రబాబు ఇంతవరకు ఎన్నికలకే రాలేదు.
+ 11న ఎన్నికలు ఉన్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలచుకోండి. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద ప్రతి మేలో రూ. 12500 రూపాయలు ఇస్తారు. గిట్టుబాటు ధరకై మూడు వేల కోట్లతో ఒక నిధి ఏర్పాటు చేస్తారు.
+ డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తారు. సున్నా వడ్డికే రుణాలు ఇస్తారు. కాలేజీ విద్యార్థులు ఏ కోర్సు అయినా చదవచ్చు. ఏ కోర్సు చదివిన ప్రభుత్వం ఉచితంగా చదివిస్తుంది. ఆరోగ్య శ్రీలో కార్పొరేట్ ఆస్పత్రిలను చేరుస్తాం. పిల్లలను బడికి పంపించడానికి తల్లిదండ్రులకు రూ. 15వేలు ఇస్తాం. అవ్వలకు తాతలకు పెన్షన్లు రూ. రెండు వేల నుంచి క్రమంగా మూడు వేలకు పెంచుతాం. వికలాంగులకు పెన్షన్లు మూడు వేలు ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ మహిళలకు ఆర్థికసాయంగా రూ.75వేలు ఇస్తాం. మీ సేవ చేసే అవకాశం జగనన్నకు ఇవ్వండి.