వైఎస్ షర్మిల పార్టీకి రంగం సిద్ధమైంది. పార్టీ పేరును అధికారికంగా ప్రకటించడానికి సమయం ఆసన్నమైంది. దీనికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేశారు. పార్టీ పేరును ప్రకటించడానికి ముందే కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద పేరు రిజిస్ట్రర్ చేయించనున్నారు. మరో వారం రోజుల్లో ఈ పనులు మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.
ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ నెలకొల్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరహాలోనే జెండా, అజెండా ఖరారు చేసే అవకాశాలున్నాయని సమాచారం. వైసీపీ జెండాను పోలిన విధంగానే మూడు రంగుల్లో తమ పార్టీ పతాకానికి రూపకల్పన చేస్తున్నారామే.
పార్టీ జెండాలో ఆకుపచ్చ, నీలం, తెలుపు లేదా పసుపు మిశ్రమం ఉండొచ్చని సమాచారం. ఆకుపచ్చ, నీలం రంగులు ఖాయం చేశారు. మూడు రంగుగా తెలుపు లేదా పసుపు.. ఈ రెండింట్లో ఏదో ఒకటి ఖరారు చేస్తారని అంటున్నారు. తెలుపు కంటే పసుపు వైపే షర్మిల మొగ్గు చూపుతారని తెలుస్తోంది. పార్టీ జెండాలో తెలుపును చేర్చితే అచ్చంగా వైసీపీని పోలి ఉంటుందని వైఎస్ షర్మిల భావిస్తున్నట్లు సమాచారం.
వైసీపీ విధి విధానాలు దాదాపు వైసీపీని పోలి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ప్రజలను ఆకర్షించిన వైసీపీ విధానాలనే తెలంగాణలోనూ అమలు చేసేలా షర్మిల ప్రకటిస్తారని సమాచారం. పార్టీకి మూలస్తంభంగా భావించే విధి విధానాల రూపకల్పనలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలను తీసుకోకూడదని ఆమె భావిస్తున్నట్టు చెబుతున్నారు.
వైఎస్ షర్మిల తన పార్టీ ప్రకటనను ఖమ్మంలోనే చేయబోతున్నారు. ఖమ్మంలోనే వైసీపీ 2014లో ఒక ఎంపీ, రెండు ఎమ్మెల్యేలు గెలిచింది. ఈ క్రమంలోనే బలమున్న ఇక్కడే షర్మిలపార్టీని ప్రకటించబోతున్నట్లు సమాచారం.