పాల పొంగు ఎంత వేగంగా పొంగుతుందో.. అంతే వేగంగా పడిపోతుంది. కాస్త వేడి తగ్గినా.. అందుకు భిన్నంగా ఒక స్థాయి దాటినా కూడా అది కిందకు పొర్లాల్సిందే. అదేం సిత్రమో కానీ.. సంచలనంగా ఎంట్రీ ఇచ్చిన షర్మిలకు వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. ఆమెకు పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇవ్వటం తెలిసిందే. ఆర్భాటంగా కార్యక్రమాల్ని నిర్వహించటం.. వాటికి కొన్ని మీడియా సంస్థలు అంచనాలకు మించిన కవరేజ్ ఇవ్వటం తెలిసిందే. దీంతో.. షర్మిల పార్టీ ఇమేజ్ బిల్డింగ్ కు ఢోకా లేదన్నట్లుగా ప్రచారం జరిగింది.
ఇంతలోనే ఏమైందో ఏమో కానీ.. సడన్ గా షర్మిల పార్టీకిమొన్నటివరకు ప్రాధాన్యత ఇచ్చిన పలు మీడియా సంస్థలు సైతం ఆమె గురించి ప్రత్యేక కథనాల్ని పోస్టు చేయటం లేదు. కొన్ని మీడియా సంస్థలైతే షర్మిలను పట్టించుకోవటం మానేశాయి. అంతే ప్రతి మంగళవారం ఆమె నిర్వహిస్తున్న దీక్షలకు స్పందన కూడా అంతంత మాత్రంగా ఉంది. మొదట్లో షర్మిల కార్యక్రమం అంటే చాలు.. కొన్ని మీడియాసంస్థలు ఆమె మాటలకు భారీఎత్తున పబ్లిసిటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. షర్మిల ఏం మాట్లాడినా ఫస్ట్ పేజీల్ పబ్లిష్ చేసే మీడియా సంస్థల్లోనూ ఈ మధ్యన షర్మిల వార్తలకు ప్రాధాన్యత తగ్గిస్తున్న వైనం కనిపిస్తోంది.
ఇక.. షర్మిల పార్టీని మొదటి నుంచి ఉన్న తెలంగాణ సంప్రదాయ పార్టీలు.. వారి మీడియా ప్రతినిదులు పెద్దగా పట్టించుకున్నది లేదు. మొన్నటివరకు ఆమె నోటి నుంచి మాట రావటం ఆలస్యం.. మొదటిపేజీకి తగ్గకుండా ప్రాధాన్యత ఇచ్చే వారు సైతం లోపలి పేజీల్లో ఒక మూల సింగిల్ కాలమ్ ఐటెం ఇస్తున్నారంటే.. దాని అర్థం షర్మిలకు ఫాలోయింగ్ పెద్దగా లేనట్లే. ఎందుకిలా జరుగుతుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. షర్మిల పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలన్ని కూడా ఈవెంట్ల మాదిరి మారినట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దీనికి తోడు తాజాగా షర్మిలకు అత్యంత సన్నిహితంగా ఉండే ఇందిరా శోభన్ పార్టీకి గుడ్ చెప్పి సంచలనంగా మారారు. మొదట్లో షర్మిల పార్టీకి వచ్చిన హైప్ చూసి ఆ పార్టీలో భాగస్వామ్యం అవుతున్న వారు.. ఇప్పుడు తప్పు చేశామా? అన్న అంతర్మధనంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. మొదట్లో షర్మిల పార్టీకి ఉన్న హైప్ అంతకంతకూ తగ్గిపోతోందని.. షర్మిల కూడా పార్టీ విషయంలో మొదట్లో చూపించినంతగా శ్రద్ధ చూపించట్లేదన్న మాట వినిపిస్తోంది. ఇలా అయితే ఎలా అన్నది ఇప్పటికే పార్టీలో పాలుపంచుకోవటానికి వచ్చిన వారంతా అయోమయానికి గురవుతున్నట్లుగా చెబుతున్నారు.