అనుకున్నది అనుకున్నట్లుగా జరగకుంటే ఆ ఇబ్బంది అంతా ఇంతా కాదు. రాజకీయ ఎజెండాతో రంగంలోకి దిగిన వారి అంచనాలకు భిన్నంగా పరిణామాలు ఉంటే.. పరిస్థితి ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనంగా షర్మిల ఒక నిదర్శనంగా నిలుస్తారు. గడిచిన పది వారాలుగా.. ప్రతి మంగళవారం ఆమె దీక్ష చేయటం.. దాని కోసం ఆమె చేసే కసరత్తు అంతా ఇంతా కాదు. మిగిలిన వారికి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఘాటుగా విమర్శలు.. ఆరోపణలు చేసే షర్మిల వ్యాఖ్యలు హాట్ టపిక్ గా మారుతున్నాయి.
అయితే.. తానెంతగా ప్రయత్నించినా.. తాను అశించినంత సంగతి తర్వాత.. తన వ్యాఖ్యల్ని.. ఘాటు ఆరోపణల్ని పరిగణలోకి తీసుకోకుండా ఉండటమే కాదు.. ఆ పార్టీకి చెందిన ఎవరూ షర్మిల మాటలపైనా.. విమర్శల పైనా స్పందించకుండా ఉండిపోవటం ఆమెకు ఇబ్బందికరంగా మారింది. ప్రతి మంగళవారం నిరుద్యోగ యువత ఎజెండా తీసుకొని.. దీక్షలు చేయటం తెలిసిందే. తాజాగా వరంగల్ పట్టణంలోని హయగ్రీవాచారి గ్రౌండ్స్ సమీపంలో షర్మిల తాజా దీక్ష జరిగింది.
తెలంగాణకు నష్టం కలిగేలా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు ఉంటున్నప్పటికీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించటం లేదని ఆమె మండిపడ్డారు. ప్రస్తుతం కేసీఆర్ జుట్టు బీజేపీ చేతిలో ఉందని.. అందుకే కేంద్రానికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయటం లేదన్నారు. అంతేకాదు.. తానెంత ఘాటుగా మాట్లాడినప్పటికీ సీఎం కేసీఆర్ రియాక్టు కావట్లేదన్న ఆవేదన ఆమె తాజా మాటల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.
తెలంగాణ యువత ఉద్యోగాల కోసం పది వారాలుగా తాను దీక్షలు చేస్తున్నా.. కేసీఆర్ సర్కారుకు చీమ కుట్టినట్లుగా కూడా లేదని.. నిరుద్యోగుల కలల సాకారం కోసం ఎన్ని వారాలైనా సరే దీక్షలు చేస్తానని ఆమె చెప్పారు. ముఖ్యమంత్రి మెడలు వంచే వరకు దీక్షలు సాగిస్తానని.. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నా.. నోటిఫికేషన్ రావటం లేదన్నారు. నిరాశతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాలకు సైతం కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు.
ఉద్యమంలో ఏం త్యాగం చేశారని.. తన కుటుంబంలోని ఐదుగురికి పదవులు ఇచ్చుకున్నారంటూ మండిపడ్డారు. తన మాటల్ని విన్నంతనే విరుచుకుపడే మసాలా దట్టించినప్పటికీ.. షర్మిల మాటల్ని సీఎం కేసీఆర్ ఏ మాత్రం పట్టించుకోకపోవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తానెంత ప్రయత్నించినా.. ఆన్సర్ రాని కేసీఆర్ నోటి నుంచి ఒక స్పందన వస్తే కానీ.. షర్మిలలో గూడు కట్టుకుంటున్న ఫస్ట్రేషన్ అంతో ఇంతో తగ్గుతుందన్న మాట వినిపిస్తోంది. మరి.. అందుకు సీఎం కేసీఆర్ సిద్ధమేనా? అన్నది అసలు ప్రశ్న.