ఊహించని కాంబినేషన్ మీద ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది. భిన్నధ్రువాలైన ఇద్దరి మధ్య ఇంటర్వ్యూ.. అందునా పొలిటికల్ ఇంటర్వ్యూ అంటే ఆసక్తి ఎవరికి ఉండదు? శత్రువు శత్రువు మిత్రుడన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా తాజాగా ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే అలియాస్ రాధాక్రిష్ణ నిర్వహించే ఓపెన్ హార్ట్ సీజన్ 3 మొదటి ఇంటర్వ్యూకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఓకే చెప్పటం.. దానికి సంబంధించిన ప్రోమోలు వైరల్ గా మారటం తెలిసిందే.
ఎట్టకేలకు ఇంటర్వ్యూ ఎయిర్ కావటం.. తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు కారణమైన ఈ ఇంటర్వ్యూలో షర్మిల తాను తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టానన్న విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు.. తెలంగాణలో రాజకీయ శూన్యత ఎంత ఉందన్న విషయాన్ని ఆమె ఉదాహరణలతో సహా పేర్కొన్నారు. ఇంతకూ షర్మిల ఏం చెప్పారన్నది ఆమె మాటల్లోనే చూస్తే..
‘‘కేసీఆర్ గారు కరోనా సమయంలో చాలా అసమర్థంగా వ్యవహరించారు. జాతీయ మీడియా కూడా చెప్పింది. కేసీఆర్ టెస్టులు చేయడానికి కూడా సుముఖంగా లేరని. అది నన్ను కలవరపెట్టింది. అప్పుడు మిత్రుడు, రాజకీయ వ్యూహకర్త నాతో ఒకటి చెప్పారు... ‘కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం ప్రత్యామ్నాయం లేకపోవడం. ఆయన పాలనవల్లో, మంచితనంవల్లో మెచ్చి ఓట్లు వేయలేదు’ అని. అంటే ఇక్కడ ప్రతిపక్షాలు కూడా విఫలమైనట్టు. ఈ పరిస్థితి మార్చాలనుకున్నా’’ అని పేర్కొన్నారు.
ఒకరు చెబితే తీసుకున్న నిర్ణయం కాదని.. ఎంతో పరిశోధన చేసి, ఎంతో మందితో మాట్లాడిన తరువాత, ఎంతో లోతుగా ఆలోచించి, ఎన్నిటినో పరిగణనలోకి తీసుకొని తీసుకున్న నిర్ణయంగా ఆమె చెప్పారు. తన నిర్ణయాన్ని వాళ్లకు(జగన్ అండ్ కోకు) నచ్చలేదని.. చర్చలు జరిగాయన్నారు. ‘‘వాళ్ల అభిప్రాయం వాళ్లు చెప్పారు. నా నిర్ణయం నేను చెప్పాను. కానీ బాధ ఎక్కడ కలిగిందంటే... మీరన్నట్టు రామకృష్ణారెడ్డి అన్న ‘సంబంధంలేదు’ అని మాట్లాడినందుకు. నేను రాజకీయాల్లో తొలి అడుగు వేసిన రోజున ‘సంబంధం లేదు’ అన్న పదం వాడారు. అదే జగన్‌మోహన్‌రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్లకు అవసరమైనప్పుడల్లా అడిగిందల్లా నా శక్తికి మించి చేశాను’’ అని ఓపెన్ అయిన ఆమె.. తెలంగాణలో ఉన్న రాజకీయ శూన్యత గురించి చెప్పుకొచ్చారు.
తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందని.. ప్రతిపక్షమే లేదన్నారు. రాష్ట్రంలో ఈ రోజున కాంగ్రెస్.. పార్టీగా కాకుండా కాంగ్రెస్ సప్లయింగ్ కంపెనీగా మారిందన్నారు. ‘‘కేసీఆర్‌కు ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి? ఎంతకు కావాలి? అని బేరమాడే స్థితికి వచ్చింది కాంగ్రెస్. అది ప్రతిపక్షమెలా అవుతుంది? రేవంత్‌రెడ్డి గారి పిలక కేసీఆర్ చేతుల్లో ఉంది. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలక కాదు... మెడ తీసేయగలడు. అలాంటివాడు కేసీఆర్ మాట వింటాడా? కాంగ్రెస్ మాట వింటాడా? బీజేపీ అంటారా..! బండి సంజయ్ గారేమో కేసీఆర్ అవినీతి మీద నా దగ్గర వంద ఆధారాలున్నాయంటారు. ఒక్కటి కూడా బయటపెట్టరు. ఈ ప్రతిపక్షాలన్నీ విఫలమైనాయి. ప్రస్తుతం తెలంగాణలో నియంత పాలన సాగుతోంది. కనుక కచ్చితంగా మా పార్టీకి కూడా ఇక్కడ ఆస్కారం ఉంది. అందులో సందేహమే లేదు’’ అంటూ తనకున్న అవకాశాల లెక్కను చెప్పుకొచ్చారు.