దూకుడుగా ప్రచారం చేయటంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల తీరు వేరుగా ఉంటుంది. సుత్తి లేకుండా సూటిగా ఉండే ఆమె మాటలకు జనాల నుంచి వచ్చే స్పందన అంతా ఇంతా కాదు. ఆమె మాటలు వినేందుకు జనం పోటెత్తుతుంటారు. బాబును.. చినబాబును ఉద్దేశించి ఆమె చేసే విమర్శలు కాసింత ఘాటుగా ఉంటాయి.
మొహమాటం అన్నది లేకుండా జనం అనుకునే మాటల్ని షర్మిల తన ప్రసంగంలో భాగంగా చెప్పేస్తుంటారు. జగన్ అన్న వదిలిన బాణం అన్న మాటకు తగ్గట్లే ఆమె వ్యాఖ్యలు సూటిగా.. ప్రత్యర్థులు విలవిలలాడేలా ఉంటాయి. తన ఎన్నికల ప్రచారాన్ని లోకేశ్ బరిలో ఉన్న మంగళగిరిలో మొదలు పెట్టిన ఆమె.. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారు.
బస్సు యాత్ర చేస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని.. అభిమానుల్ని.. కార్యకర్తల్ని హుషారెత్తించే ఆమె.. తాజాగా కాసింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగంలో బాబుపై నిప్పులు చెరిగిన ఆమె.. లోకేశ్ మీద వ్యంగ్య వ్యాఖ్యలతో పాటు.. పంచ్ లు వేశారు.
బాబు వస్తే జాబు వస్తుందన్నారని..కానీ ఎవరికి వచ్చిందో తెలుసు కదా? అని ప్రశ్నించిన షర్మిల.. రాష్ట్రంలో బాబు పవర్ లోకి వచ్చిన తర్వాత ఆయన కొడుకు లోకేశ్ కుమాత్రమే వచ్చిందన్నారు. అది కూడా ఒక ఉద్యోగం కాదని.. మూడు ఉద్యోగాలన్నారు. బాబు తన కొడుక్కి మూడు శాఖలకు మంత్రిని చేశారన్నారు.
ఈ పప్పు లోకేశ్ కు కనీసం వర్థంతికి.. జయంతికి తేడా తెలీదు. అఆలు రావు కానీ అగ్ర తాంబూలం నాకే కావాలని వెనకటికి ఎవరో అన్నారట.. పప్పు తీరు కూడా అలాగే ఉందని ఎద్దేవా చేశారు. ఒక్క ఎన్నికల్లో గెలవని పప్పుకు ఏ అర్హత ఉందని బాబు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు.
దీన్ని పుత్ర వాత్సల్యం కాదా? అని నిలదీసిన షర్మిల.. చంద్రబాబు కొడుక్కి ఏమో మూడు ఉద్యోగాలు.. మామూలు ప్రజలకు మాత్రం ఉద్యోగాల్లేవు.. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవంటూ మంచిపడ్డారు. షర్మిల నోటి నుంచి పప్పు లోకేశ్ అన్న మాటకు విపరీతమైన స్పందన వస్తోంది.