రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటనతో సంచలనంగా మారిన వైఎస్ షర్మిల.. మహిళా దినోత్సవం వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై షాకింగ్ వ్యాఖ్యలు చేసేందుకు ఆమె వెనుకాడలేదు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. కేసీఆర్ సర్కారుపై నేరుగా తలపడేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పాలి. తెలంగాణ గడ్డ రాజకీయ చైతన్యానికి అడ్డా అని.. ఇక్కడి మహిళలు ఎవరికి తక్కువ కాదన్నారు.
పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో అసమానతలు ఉన్నట్లుగా ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతోందని.. ఈ విషయంలో అధికార పార్టీ ఘోరంగా విఫలమైందన్నారు. వైఎస్ హయాంలో ఎంతో మంది మహిళలు మంత్రి పదవులు అలంకరించారని.. ప్రత్యేక రాష్ట్రంలో ఐదేళ్ల తర్వాత..అది కూడా ఇద్దరికి మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారన్నారు.
మహిళలు అన్నింటిలోనూ సగమైనప్పుడు ఇలాంటి అసమానతలు ఎందుకో పాలకులు చెప్పాలని డిమాండ్ చేశారు. చట్టసభల నుంచి ఉద్యోగాల వరకు అన్నింట్లోనూ మహిళలకు అన్యాయం జరుగుతుందన్న ఆమె.. అన్నింటిలోనూ మహిళలకు నిర్దిష్ట కోటా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. మహిళల హక్కుల కోసం తాను నిలబడతానని.. తాను చేసే ప్రతి పనిలోనూ మహిళలకు తగిన ప్రాతినిధ్యం వహించేలా అక్కలా.. చెల్లెలా తాను మాటిస్తున్నట్లు చెప్పారు. ఇంత సూటిగా షర్మిల విమర్శనాస్త్రాల్ని సంధించిన వేళ.. దీనిపై గులాబీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.