పట్టుమని పది మంది కూడా ఆమె వెంట లేరు. పార్టీ పెట్టి.. పాదయాత్రగా తెలంగాణ అంతటా తిరుగుతున్నా స్పందన లేదు. 2వేల కి.మీలు పూర్తి చేసినా కూడా తెలంగాణ సమాజం.., మీడియా వైఎస్ షర్మిలను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అందుకే ఆ ఫస్ట్రేషన్ లో ఆమె ఏం మాట్లాడుతుందో అర్థం కావడం లేదని పలువురు సెటైర్లు వేస్తున్నారు. ఆమె భాష చూస్తుంటే అదే అనిపిస్తోంది మరీ..
నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీలో ప్రారంభించిన పాదయాత్రకు అద్భుత స్పందన వచ్చింది. రైతులు, ప్రజలు వెంట నడిచిన పరిస్థితి. నియోజకవర్గాల్లో పర్యటిస్తుంటే నేతలంతా కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ జగన్ విషయంలోనూ అంతకుమించిన స్పందన.. కానీ ఏపీ ఆడకూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో అప్పుడే 2వేల కి.మీల పాదయాత్ర పూర్తయినా కూడా ఏమాత్రం ఉలుకూ పలుకు లేదు. ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఒక్క చిన్న స్థాయి నాయకుడు కూడా ఆమె పార్టీలోకి రాకపోవడం చూసి అందరూ షర్మిల పాదయాత్ర వృథా అంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే, క్షేత్రస్థాయి నివేదికల ప్రకారం చూస్తే, షర్మిల పాదయాత్ర ఓటర్లపై పెద్దగా ప్రభావం చూపడం లేదని అంటున్నారు. ఆమె ఇంత కష్టపడినా వచ్చే ఎన్నికల్లో ఆమెకు ఏం ప్రయోజనం దక్కేలా కనిపించడం లేదని అభిప్రాయపడుతున్నారు.
షర్మిల తన సభలకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తోందని చెప్పుకుంటున్నప్పటికీ.. ఆశించిన జనం రావడం లేదు. కనీసం సర్పంచ్ స్థాయి నేతలు కూడా ఆమె సమక్షంలో పార్టీలో చేరడం లేదు. అసలు నేతల నుంచి స్పందనే కరువైందని అంటున్నారు. ఆమె ఏ తెలంగాణకు చెందిన నేత కాకపోవడం.. తెలంగాణ కార్డును ప్లే చేయలేకపోవడంతో చేరడానికి చాలా మంది భయపడుతున్నారు. ఆమె తన తండ్రి వైఎస్ఆర్ సెంటిమెంట్ పైనే ఆధారపడి ఉంది.
ఇంత కాలికాలిన పిల్లిలా తిరుగుతున్నా కూడా షర్మిల పాదయాత్రకు స్పందన రాకపోవడం.. ఎవరూ చేరకపోవడం చూసి షర్మిలలో అసహనం పెల్లుబుకుతోంది. అందుకే ఏ నియోజకవర్గానికి వెళితే ఆ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలను తిట్టడమే పనిగా పెట్టుకుంది. ఇటీవల సంగారెడ్డి వెళ్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని తిట్టింది. జగ్గారెడ్డి వైఎస్ఆర్ ఫ్యామిలీ గుట్టును అంతా బయటపెట్టి షర్మిల పరువు తీశాడు. అయినా బుద్దిరాకుండా ఆంథోల్ వెళ్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో సున్నం పెట్టించుకుంది.
షర్మిలను ఎవరూ పట్టించుకోకపోవడంతో 'దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి' అని సవాల్ చేస్తోంది. ఏకంగా ప్రెస్ మీట్లకు 'బేడీలు' తెచ్చుకుంటోంది. అరెస్ట్ చేయండి.. నడుచుకుంటూ వస్తానని ప్రజల్లో ఫెయిత్ కోసం సవాళ్లు చేస్తోంది. కానీ ఈమె పిచ్చి మాటలను ఎవరూ పట్టించుకోవడం లేదు. అసలు షర్మిలను అరెస్ట్ చేసేంత సీన్ లేదని.. ఆమె మానాన ఆమె వాగుకుంటూ వెళ్లిపోతోందని అందరూ పట్టించుకోవడం లేదు. అనవసరంగా షర్మిలకు ప్రాధాన్యతనిచ్చి మన పరువు మనం తీసుకోవద్దని అధికార టీఆర్ఎస్ అవైడ్ చేస్తోంది. దీంతో షర్మిలలో ఫస్ట్రేషన్ మరింతపెరిగి పోయి ఏం మాట్లాడుతుందో అర్థంకాకుండా తయారైంది.
ఎవరూ పెద్ద లీడర్స్ తనను పట్టించుకోవడం లేదని చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ తిట్టడం మొదలుపెట్టింది. గట్టిగా నలుగురు కూడా లేని ఆమె వెంట ఈ కోపం నాశాలానికి ఎక్కి ఏదేదో మాట్లాడుతోంది. చూస్తుంటే ఈమెను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని జగ్గారెడ్డి లాంటి నేతలు సెటైర్లు వేస్తున్న పరిస్థితి.
రాజకీయాల్లోకి వచ్చాక పరిణతి ఉండాలి. అభివృద్ధి, సమస్యలపై మాట్లాడాలి. కానీ ఇలా వ్యక్తిగతంగా ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చూస్తే పోయేది షర్మిల పరువే. దాన్ని గుర్తు ఎరిగి ఇప్పటికైనా షర్మిల జాగ్రత్త వహిస్తే చాలా మంచిదని పలువురు హితవు పలుకుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.