ఒకవైపు జాతీయ భాష హిందీని నిర్బందంగా భారతీయ ప్రజలకు నేర్పించాలంటూ కస్తూరి రంగన్ కమిటీ చేసిన సిఫార్సు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ విషయంలో పలు రాష్ట్రాలు అభ్యంతరం చెప్పాయి. నిర్బంద హిందీని రాష్ట్రాలు గట్టిగా వ్యతిరేకించడంతో కేంద్రం కూడా చివరకు వెనక్కు తగ్గాల్సి వచ్చింది. అలాంటి ప్రతిపాదనను అమలు చేయడం లేదని కేంద్రం ప్రకటించింది.
కట్ చేస్తే ఇప్పుడు సీన్లోకి వచ్చారు శశిథరూర్. ఈయన కూడా భాషల విషయంలో మాట్లాడుతున్నారు. కొత్త ప్రతిపాదన చేశారు ఈ కాంగ్రెస్ ఎంపీ. హిందీని కాదు, సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించి.. దాన్ని అందరూ నేర్చుకునేలా చూడాలని శశిథరూర్ అంటున్నారు. సంస్కృతం అత్యంత పురాతన భాష అని, అది భారతీయుల అందరి భాష అని.. దేవభాష అయినప్పటికీ అది దేశంలో మెజారిటీ ప్రజలు మాట్లాడటం లేదని, సంస్కృతాన్ని మాట్లాడే ప్రజల ఉనికే లేకుండా పోతోందని.. ఇలాంటి నేపథ్యంలో సంస్కృతాన్ని జాతీయ భాష గా ప్రకటించి, విద్యార్థి దశ నుంచి దాన్ని నేర్పించడం మొదలు పెడితే మళ్లీ ఆ భాష ప్రజలకు చేరువ అవుతుందని శశిథరూర్ అంటున్నారు.
ఈ విషయంలో తను కేంద్రాన్ని కోరనున్నట్టుగా, పూర్తి సమాచారంతో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నట్టుగా శశిథరూర్ ప్రకటించారు. శశిథరూర్ ఏం మాట్లాడినా అందులో సబ్జెక్ట్ అయితే ఉంటుంది.
కానీ ఇప్పటికిప్పుడు సంస్కృతాన్ని దేశ వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడం అంత తేలిక కాదు. అందుకు సంబంధించిన లిపి కూడా వాడుకలో లేకుండా పోయింది. సంస్కృతాన్ని చాలా రాష్ట్రాల్లో ఒక సబ్జెక్టుగా కొనసాగిస్తూ ఉన్నారు.
ఏపీలో కూడా ఇంటర్మీడియట్ స్థాయిలో సంస్కృతాన్ని ఒక సబ్జెక్టుగా తీసుకోవచ్చు. కానీ హిందీ లిపిలో దాన్ని చదువుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో శశిథరూర్ ప్రతిపాదన సాధ్యం కావడం కష్టమని చెప్పొచ్చు. ఈ విషయంలో కేంద్రం ఏమంటుందో!