మ‌మ‌త నిప్పు అంటూ..మోడీకి బీజేపీ ఎంపీ చురకలు

Update: 2019-02-05 12:07 GMT
కేంద్ర వైఖ‌రిని నిర‌సిస్తూ కోల్‌ క‌తాలో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ చేప‌ట్టిన దీక్ష దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అవుతున్న సంగ‌తి తెలిసిందే. శారద చిట్‌ ఫండ్ కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు నేతృత్వం వహిస్తున్న కోల్‌ కతా సీపీ రాజీవ్ కుమార్.... ఈ కేసులోని ఆధారాలు మాయం చేశారంటూ సీబీఐ వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై సీపీని ప్రశ్నించేందుకు ఆదివారం 40 మందికి పైగా సీబీఐ అధికారులు ఆయన ఇంటికి వెళ్లడంతో స్థానిక పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పశ్చిమబెంగాల్ పోలీసులకు - సీబీఐ అధికారులకు మధ్య వివాదం చోటుచేసుకుంది. మరోవైపు రాజకీయ కక్ష సాధింపుతో కేంద్ర ప్రభుత్వం తమపైకి సీబీఐని ఉసిగొల్పుతున్నారంటూ సీఎం మమత ధర్నాకు దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

అయితే, ఈ ఎపిసోడ్‌ లో బీజేపీని ఇర‌కాటంలో పెట్టే ఆ పార్టీ ఎంపీ శతృఘ్నసిన్హా తాజాగా మోడీ మ‌ళ్లీ బుక్ చేసే కామెంట్లు చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి - తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని సిన్హా నిప్పుతో పోల్చారు.  నిప్పుతో చెలగాటమాడొద్దని ప్రధాని నరేంద్రమోడీకి పరోక్షంగా సూచించారు. ఇప్పటికే ప్రభుత్వ సంస్థలు అప్రతిష్టపాలై గౌరవాన్ని కోల్పోయాయని ట్వీట్ చేసిన ఆయన కాలపరీక్షకు నిలిచి గెలిచిన బెంగాల్ టైగ్రస్‌ తో ఆటలెందుకని హితవు పలికారు. మమతా బెనర్జీ ఐరన్‌ లేడీ అని ఆమెను జాగ్రత్తగా హ్యాండిల్‌ చేయకుంటే ప్రమాదమని పార్టీని హెచ్చరించారు. ఏమైనా సమయం మించిపోతుంది జాగ్రత్త అంటూ సిన్హా నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తూ ట్వీట్‌ చేశారు.

కాగా,  కోల్‌ క‌తాలో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ చేప‌ట్టిన దీక్ష‌పై ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ స్పందించారు. బెంగాల్‌ లోని సీబీఐ వ్య‌వ‌హారం మీతో ఎవ‌రైనా మాట్లాడారా అని ఓ విలేఖ‌రి అడిగిన ప్ర‌శ్న‌కు న‌వీన్ బ‌దులిచ్చారు. గ‌త ఏడాది కాలం నుంచి తృణ‌మూల్ పార్టీకి చెందిన ఒక్క‌రు కూడా కాంటాక్ట్‌లో లేర‌న్నారు. రాష్ట్ర అంశాల‌పైనే త‌మ పార్టీ అభిప్రాయాలు వెల్ల‌డిస్తోంద‌న్నారు. సీబీఐ ఓ ప్రొఫెష‌న‌ల్ తీరులో ప‌నిచేసేందుకు స‌హ‌కారం అందించాల‌న్నారు. సీబీఐ అంశంలో రాజ‌కీయ జోక్యం స‌రికాద‌న్నారు.


Tags:    

Similar News