ఎన్ ఆర్ ఐ.. పారిశ్రామికవేత్త జయరామ్ హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ హత్య గురించిన సమాచారం బయటకు వచ్చిన నాటి నుంచి శిఖా చౌదరి పేరు ప్రముఖంగా వినిపించటం తెలిసిందే. ప్రముఖంగా వినిపించిన శిఖా చౌదరి.. ఎక్కడా కనిపించలేదు. అలాంటిది నిన్న (గురువారం) రాత్రి ఒక్కసారిగా ఒక చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూతో ఆమె తెర మీదకు వచ్చారు.
ఇప్పటివరకూ ఆమెను ఫోటోలలో చూసిన వారికి ఆమె లైవ్ గా కనిపించటమే కాదు.. హత్య విషయంలో ఆమె వాదన ఏమిటన్న విషయంపై కాసింత క్లారిటీ వచ్చింది. దాదాపుగా మూడు రోజుల పాటు శిఖా చౌదరిని విచారించిన ఏపీ పోలీసులు.. జయరామ్ హత్య విషయంలో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని క్లీన్ చిట్ ఇవ్వటం తెలిసిందే.
కేసు తెలంగాణ పోలీసులకు బదిలీ అయిన వేళ.. ఆమె గురించి అందరూ చర్చించుకుంటున్న నేపథ్యంలో ఒక చానల్ కు ఆమె ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వటం ఒక ఎత్తు అయితే.. జయరామ్ హత్య విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్న వాదనను బలంగా వినిపించటం కనిపించింది. అంతేకాదు.. పలు అంశాలపై ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
జయరామ్ హత్య జరిగిన విషయం బయటకు వచ్చాక.. ఆయన ఇంటికి తాను ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్న దానిపైనా వివరణ ఇచ్చిన ఆమె.. తాను మాత్రమే కాదు..తనకు ముందు చాలామంది ఆయన ఇంటికి వెళ్లారన్న మాటను చెప్పారు. మేనమామ జయరామ్ హత్యతో తనకెలాంటి సంబంధం లేదని.. హత్య జరిగిన విషయం తెలిసిన తర్వాత తన ప్రాజెక్టు రిపోర్ట్ తెచ్చుకోవటం కోసమే తాను వెళ్లినట్లు చెప్పింది.
అత్త కమ్ జయరామ్ సతీమణి పద్మశ్రీతో తనకు అంత మంచి సంబంధాలు లేవని.. ఆమె అమెరికా నుంచి వచ్చేలోపే ఇంటికి వెళ్లి ప్రాజెక్టు రిపోర్ట్ తెచ్చుకోవాలని భావించాని.. అది తప్పే అయినా తప్పనిసరి అయ్యిందన్నారు. తాను అలా ప్రవర్తించటం సరికాదని పేర్కొంది.
జనవరి 29 మధ్యాహ్నం అంకుల్ తన ఇంటికి వచ్చారని.. రాత్రి ఎనిమిది గంటల వరకూ ఆయన ఇంట్లోనే ఉన్నట్లు చెప్పారు. తన కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి మాట్లాడుకున్నామన్నారు. ఆయన తిరిగి వెళుతూ తన ప్రాజెక్టు రిపోర్ట్ తీసుకెళ్లారని.. తర్వాతి ఉదయం ఫోన్ చేసి కోటి రూపాయిలు సర్దాలని చెప్పినట్లు చెప్పారు. ఎందుకన్న మాట అడిగే లోపు ఆయన ఫోన్ పెట్టేశారని.. తర్వాత మళ్లీ ఫోన్ చేసి డబ్బుల గురించి అడిగారన్నారు. గతంలో తాను ఒకరి దగ్గర రూ.4 కోట్లు తీసుకున్నానని.. వాటిని సర్దాల్సి వచ్చిందని.. ఒత్తిడి పెరిగినట్లుగా చెప్పారన్నారు.
అదే ఆయనతో మాట్లాడటం చివరిసారని.. తర్వాత తన తల్లి తనకు ఫోన్ చేసిన జయరామ్ హత్య గురించి చెప్పే వరకూ తనకు ఆ విషయం గురించి తెలీదన్నారు. జయరామ్‌కు చెందిన ఆస్తిపాస్తులేవీ తన పేరు మీద లేవని.. అదంతా తప్పుడు ప్రచారంగా చెప్పారు. 2017లో రాకేశ్ రెడ్డితో పరిచయమైందని.. అతడి తీరు బాగోకపోవటంతో ఏడు నెలల నుంచి అతడితో మాటల్లేవన్నారు. జయరామ్ కు రూ.4 కోట్లు అప్పు ఇచ్చేంత స్తోమత రాకేశ్ రెడ్డికి లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మేనమామ హత్య విషయంలో అత్త పద్మశ్రీని ఎవరో తప్పుదారి పట్టిస్తున్నట్లుగా ఆమె చెప్పారు. తన మీద వస్తున్న ఆరోపణల విషయంలో తాను బయటపడతానన్న నమ్మకం ఉందన్న ధీమాను వ్యక్తం చేశారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా టీవీ చానల్ లో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వటం ద్వారా శిఖా అందరిని సర్ ప్రైజ్ చేయటమే కాదు.. సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు తెర తీశారని చెప్పక తప్పదు.