వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా స్పీచులు ఇస్తూ కోట్లాది మంది మనసుల్ని దోచుకున్న ప్రధానిగా నరేంద్ర మోడీని చెప్పాలి. అయితే.. ఆయన ఇచ్చిన స్పీచులకు.. ఆయన వ్యవహరించే తీరుకు మధ్య వ్యత్యాసం ఇప్పుడిప్పుడే అందరికి అర్థమవుతున్న వేళ.. ఆయనలోని లోపాల్ని ఎత్తి చూపిస్తూ ట్వీట్లు చేసేందుకు సైతం నెటిజన్లు వెనుకాడుతున్నారు. అయితే.. మిగిలిన నేతల మాదిరి కాకుండా తనలోని లోపాన్ని ఎత్తి చూపే వారి విషయంలో మోడీ రియాక్ట్ అవుతున్న తీరు ఆసక్తికరంగా ఉండటమే కాదు.. అభినందించేలా ఉంది.
ఎప్పుడెక్కడ మనసుల్ని దోచుకోవాలో బాగా తెలిసిన మోడీ తాజాగా తన లోపాన్ని ఎత్తి చూపించిన ట్వీట్ పైన తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ప్రత్యేకమైన హావభావాలు.. ఆహార్యంతో ఉండే మోడీలో గొప్ప లక్షణాలు చాలానే ఉన్నా.. ఒక లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందన్నారు.
మోడీ ముఖంలో చెరగని చిరుదహాసం కనిపించటం లేదని.. ఆయన తరచూ సీరియస్ గా ఉంటున్నారని.. ఇటీవల జరిగిన అవిశ్వాస తీర్మానం సమయంలోనూ ఆయన సీరియస్ గా ఉన్నారని.. రెండు.. మూడు సందర్భాల్లో మాత్రమే నవ్వారంటూ ఒకరు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.తన ట్వీట్ కు ఒక వీడియోను పోస్ట్ చేశారు.
ఈ ట్వీట్ చేసిన శిల్పి అగర్వాల్ అనే వ్యక్తి మోడీని నవ్వాలని కోరారు.. అంతా బాగుంది.. ఒక్క నవ్వు లేకుండా ఉండటమేనన్న ట్వీట్ కు బదులిచ్చిన మోడీ.. మీ సూచనను స్వీకరిస్తున్నా అంటూ ఆన్సర్ చేశారు. మైనస్ ను ప్లస్ చేసుకోవటంలో మోడీ తర్వాతే ఎవరైనా!