షాకింగ్: శివసేన మానవ బాంబులు రెడీ!

Update: 2016-09-27 11:30 GMT
ఉడి ఉగ్రదాడి అనంతరం భారత్ - పాకిస్తాన్ ల మధ్య తీవ్ర చిచ్చు చెలరేగింది. ఇప్పటికే చాలా మంది యుద్దాన్ని కోరుకుంటున్నారని, పాక్ పై ప్రతీకారాన్ని తీసుకోవాల్సిందేనని, అమరులైన జవాన్లకు అదే సరైన నివాళి అని రకరకాల వాదనలు వినిపిస్తున్న తరుణంలో.. శివసేన ఏకంగా పెద్ద షాకింగ్ విషయం తెలిపింది. పాకిస్థాన్ ను నాశనం చేయడానికి తమ కార్యకర్తలు మానవ బాంబుల్లా మారతారని ప్రకటించింది. ఈ ప్రకటన కేవలం మాటలకే పరిమితం చేయకుండా, జిల్లా కలెక్టర్ కు ఒక మెమోరాండం సమర్పించింది.

పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకునే విషయంలో చేతలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కేవలం మాటలతో సరిపెట్టుకుంటుందని విమర్శించిన శివసేన - పాకిస్తాన్ ను నాశనం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. పాకిస్తాన్ ను నాశనం చేయడానికి తమ కార్యకర్తలు మానవబాంబుల మారతారని మెమోరాండంను జిల్లా కలెక్టర్ కు సమర్పించింది. ఈ మెమోరాండంలో 28 సూరత్ కు చెందిన శివసేన కార్యకర్తలు, పాకిస్తాన్ అంతుచూడటానికి మానవబాంబుల మారతామని ఆఫర్ చేసింది. సూరత్ శివసేన అధ్యక్షుడు అరుణ్ కలాల్ కూడా ఈ వార్తను ధృవీకరించారు.

ఒకవేళ పాకిస్తాన్ యుద్ధానికి భారత్ దిగితే, గాయాలపాలైన జవాన్లకు తాము అవయవాలు దానం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు శివసేన కార్యకర్తలు వారి సంతకాలతో ఆ మెమోరాండంలో వెల్లడించారు. గత రెండేళ్లుగా పాకిస్తాన్ చేస్తున్న కుట్రపూరిత చర్యలకు * ఉగ్రదాడులకు భారత్ ఎలాంటి ప్రతీకారం తీర్చుకోవడం లేదని, ఇప్పటికైనా పాక్ కు సరైన గుణపాఠం చెప్పాలని, ఉడీ ఘటన అనంతరం పాకిస్తాన్ కు భారత్ ఎలాంటి శిక్ష విధించబోతుందోనని ప్రపంచమంతా ఎదురుచూస్తుందని శివసేన ఈ సందర్భంగా పేర్కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News