శివసేన రూటే సెపరేటు అనేందుకు మరో నిదర్శనం. తాజా క్యాబినెట్ విస్తరణలో సేన ఎంపీలకు పదవులు దక్కని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేబినెట్లో కొత్త మంత్రులను చేర్చుకుంటున్న సందర్భంగా తమకు పదవులు కావాలని ప్రధాని నరేంద్ర మోడీని తామేమీ దేబిరించలేదని వ్యాఖ్యానించారు.
'మాది ఆత్మ గౌరవమున్న పార్టీ. ఏదైనా గౌరవంగా రావాలి. దేని కోసమో అడుక్కోబోము' అని ఉద్ధవ్ ముంబయిలో మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. మంత్రి పదవి కోసం తమ పార్టీ ఎవరితోనూ చర్చలు జరపలేదని తేల్చిచెప్పారు. క్యాబినెట్ పదవులు తమకు ప్రాధాన్యతాంశం కాదని, వాటి కోసం ఎవరి తలుపుల దగ్గరో నిలబడబోమని చెప్పారు. కాగా, ప్రస్తుతం శివసేన నుంచి అనంత్ గీతే మాత్రమే మోడీ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు. ఈ దఫా విస్తరణలో మరో పదవి లభిస్తుందన్న వార్తలు ఆది నుంచి వినిపించినప్పటికీ, బీజేపీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం - అనంతరం జరిగిన విస్తరణ నేపథ్యంల శివసేనకు స్థానం దక్కకపోవడంతో ఉద్ధవ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.