సముద్రం గర్భంలో శివాలయం .. ఆ సమయంలో మాత్రమే దర్శనం , ఎక్కడుందంటే ?

Update: 2021-03-11 09:30 GMT
ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి శివరాత్రి శుభాకాంక్షలు.నేడు శివరాత్రి పర్వదినం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోనే అన్ని శివాలయాలు శివనామస్మరణ తో మారుమోగిపోతున్నాయి. ఇక సాధారణంగా ఆలయం అంటే ఉరి మధ్యలోనే , కొండల్లోనే , గుట్టలపైనో ఉంటాయి. కానీ , ఓ శివాలయం మాత్రం సముద్ర గర్భంలో ఉంటుంది. సముద్రంలో ఉంటే ఆ శివాలయానికి ఎలా వెళ్లాలి , అసలు ఆ శివాలయానికి ఎప్పుడు వెళ్లాలి , ఆ ఆలయం ఎక్కడ ఉంది అనే విషయాలని ఇప్పుడు చూద్దాం.

గుజరాత్ లోని బావ్ నగర్ సమీపానికి వున్న కొలియక్ అనే గ్రామంలో సముద్రం నుండి ఒకటిన్నర కిలోమీటర్ల లోపల వుంది ఈ టెంపుల్. ఇక్కడున్న ఆలయంలో శివుడు వుంటాడు. ఇందులో శివలింగం వుంటుంది. ఇదే ఇక్కడ ప్రధాన దైవం. రోజులో కొన్ని గంటలు మాత్రమే ఈ గుడిని చూడవచ్చును. మిగతా సమయమంతా ఈ గుడి సముద్రంలోనే మునిగిపోయి ఉంటుంది.

ఈ ఆలయం పేరు నిష్కలంక్ శివాలయం. గుజరాత్‌ లో అరేబియా సముద్రం తీరం వెంబడి ఒకటిన్నర కిలోమీటర్ల లోపలికి ఒక గడ్డమీద నిష్కళంక మహదేవ్‌గా శివుడు వెలసివున్నాడు. ఉదయం, సాయంత్రాల్లో అలలు తగ్గినప్పుడు కొన్ని గంటల సేపు మాత్రమే మనం స్వామిని దర్శించుకోవచ్చును. గుజరాత్‌లోని భావ్‌ నగర్ ‌కు 30కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలియాక్‌ గ్రామంలో భక్తుల దోషాలనూ, పాపాలనూ తొలగించే దేవుడిగా శివుడు పూజలందుకుంటున్నాడు.

 పురాణాల ప్రకారం పాండవులు ఇక్కడ నిష్కలంక్ మహాదేవ్ ఆలయాన్ని స్థాపించినట్లుగా చెబుతారు ఈ కొలియాక్ తూర్పు సముద్ర తీరానికి 3 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రత్యేకత ఎంటీ అంటే.. ఈ ఆలయం.. సముద్ర తీరాన కాదు ఉండేది.. సముద్రం లోపల ఉంటుంది. అంటే సముద్రం మధ్యలో దీనిని నిర్మించారు. పాండవులు తమ దోషాలను, తమకు ఏర్పడిన కళంకాలను పొగోట్టుకోవడానికి ఈ ఆలయాన్ని నిర్మించారని.. అందుకే ఈ ఇక్కడి శివాలయానికి నిష్కలంక్ అని పేరు పెట్టినట్లుగా పురాణాల్లో ఉంది. కొలియాక్ సముద్ర తీరానికి చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. అయితే ఇక్కడ ఏ ఆలయం ఉన్నట్లు కనిపించదు.

ఉదయం పూట ఈ ఆలయం పూర్తిగా నీటమునిగి ఉంటుంది. సముద్రం మధ్యలో ఆలయం ఉంది అనడానికి గుర్తుగా.. అక్కడ ఒక ధ్వజస్తంభంపై జెండా ఉంటుంది. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం 11 గంటలు దాటిన తర్వాత నుంచి మెల్లగా సముద్రం వెనక్కి వెళ్తుతుంది. దీంతో ఆలయానికి వెళ్లే మార్గం కనిపిస్తుంది. ఇక్కడ పౌర్ణమి, అమావాస్య రోజులలో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.  ఇక ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున ఇక్కడ అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. సముద్రం మధ్యలో శివాలయం ఎలా నిర్మించారనే విషయం మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు. ఆలయం నిర్మాణం చూస్తుంటే అప్పటి పనితనం, నైపుణ్యాలు కళ్ళకు కట్టినట్లుగా ఉంటాయి.

ఇక ప్రతి రోజూ మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సముద్రం పూర్తిగా వెనక్కి వెళ్ళగానే.. అక్కడి చిరు వ్యాపారులు తమ తోపుడు బండ్లపై పూలు, పూజా సామగ్రితో ఆలయం చుట్టు చేరుకుంటారు. ఆ తర్వాత ఆలయానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. మధ్యాహ్నం తర్వాత మళ్ళీ సముద్రం ముందుకు రావడం ప్రారంభిస్తుంది. అర్థరాత్రి సమయానికి మళ్లీ సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతుంది.
Tags:    

Similar News