ఎన్నికల పోలింగ్ కు ఇంకా మూడు రోజులు మాత్రమే టైం ఉంది. దీంతో టీడీపీ శిబిరం సామధానబేధ దండోపాయాలన్నింటిని ప్రయోగిస్తోంది. టీడీపీ అనుకూల మీడియా అంతా అలెర్ట్ అయ్యింది. ఈ వారం రోజుల్లో ప్రతిపక్ష వైసీపీని ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేసేస్తున్నాయి. అదే సమయంలో సెంటిమెంట్ రాజేసి టీడీపీకి ఓట్లు వేసే ఎత్తుగడలను తెరపైకి తెస్తున్నారు.
*వైసీపీ నేతలే టార్గెట్...
ఎన్నికలకు మూడు రోజులే ఉండడంతో ప్రజల దృష్టిని మరల్చడానికి టీడీపీ నాయకులు, మీడియా భయంకరమైన కుట్రలు పన్నుతోంది. మొన్నటికి మొన్న చంద్రబాబుకు కొరకరాని కొయ్యగా మారిన వైసీపీ నాయకురాలు.. ఎన్టీఆర్ భార్య అయిన లక్ష్మీపార్వతిపై దారుణ అవమానకర రీతిలో ఆరోపణలకు ఆ వర్గం మీడియా దిగి రచ్చ చేసింది. నిన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆడియో క్లిప్ అంటూ సాయంత్రాలు డిబేట్ లు పెట్టి రచ్చ చేసింది. ఇవే కాదు.. వైసీపీ నేతలు, టీఆర్ఎస్, బీజేపీతో అంటకాగడాన్ని ఎత్తిచూపుతూ ఎన్నికల్లో లబ్ది పొందే కుట్రలకు తెరతీశారు..
*రంగంలోకి శివాజీ.. సెంటిమెంట్ రగడ..
తాజాగా ఆదివారం నటుడు, రాజకీయ నేత అయిన శివాజీ రంగంలోకి దిగాడు. టీడీపీ అనుకూలంగా ఆదివారం విజయవాడలో పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసుకొని పోలవరం నిర్మాణానికి టీడీపీ పాటుపడుతోందని.. దాన్ని అడ్డుకోవడానికి టీఆర్ ఎస్ ప్రయత్నిస్తోందని.. ఎంపీ కవిత మాట్లాడిన మాటలను ప్లే చేసి సెంటిమెంట్ రగిల్చాడు. పోలవరం ఆపేందుకు ప్రధాని మోడీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని.. తనకు తెలిసిన కుట్రకోణాలను బయటపెట్టడం సంచలనంగా మారింది. ఇక వైసీపీ అధినేత జగన్.. కేసీఆర్ చేతిలో కీలుబొమ్మ అని.. జగన్ వస్తే ఏపీ వరప్రదాయిని అయిన పోలవరం పూర్తి కాదంటూ ఏపీ ప్రజలపై సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు..
ఇలా ఈ రెండు సంఘటనలే కాదు.. సెంటిమెంట్, వైసీపీని డ్యామేజ్ చేసే ఎత్తుగడలతో టీడీపీ, దాని అనుకూల మీడియా పెద్ద పెద్ద స్కెచ్ లు వేస్తోంది. ఈ మూడు రోజులు వైసీపీ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వారి ఓటు బ్యాంకు చీలి నష్టం జరిగే అవకాశాలున్నాయి.. సో వైసీపీ బహుపరాక్..