టీవీ9 వివాదం గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా - దేశవ్యాప్తంగా కూడా ఈ వివాదం సంచలనం రేకెత్తిస్తోంది. ఇందులో మాజీ సీఈఓ రవిప్రకాష్ ఎంతగా ఇరకాటంలో పడ్డారో...అదే రీతిలో శివాజీ సైతం సమస్యలను ఎదుర్కుంటున్నారు. గురుడపురాణం పేరుతో సంచలన జోస్యం చెప్పిన ఈ హీరో...టీవీ9లో ఉన్న వాటాల ద్వారా ఇబ్బందుల్లో పడ్డారు. పోలీసుల దర్యాప్తును ఎదుర్కుంటున్నారు. అయితే, గత ఐదు రోజులుగా జరుగుతున్న ఈ ఉదంతంలో శివాజీ తెరమీదకు రాకపోవడం వెనుక కారణం...శివాజీ తన మకాన్ని హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చడమేనని అంటున్నారు.
సినీ పరిశ్రమలో తన ఉనికిని చాటుకొని...పలు వర్గాల నుంచి ఆదరణ పొందిన శివాజి...అనంతరం రాజకీయాల్లోకి అడుగిడేందుకు ప్రత్యేక హోదా అంశంతో తెరమీదకు వచ్చారు. అయితే, తటస్థుడిగా ప్రకటించుకొని అనంతరం తెలుగుదేశం పార్టీ - జనసేనకు మద్దతుగా నిలిచారు. తాజాగా, టీవీ9 వాటాల వివాదం నేపథ్యంలో - అలంద మీడియా సంస్థ డైరెక్టర్ కౌశిక్ రావు ఇచ్చిన ఫిర్యాదుతో మళ్లీ తెరమీదకు వచ్చారు. ఈ ఫిర్యాదుపై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఏప్రిల్ 24 - 30 తేదీల్లో రెండు ఎఫ్ ఐఆర్ లు నమోదుచేశారు. ఈ రెండు ఎఫ్ ఐఆర్ లకు సంబంధించి నమోదైన ఆరోపణలపై 160 సీఆర్పీసీ కింద దర్యాప్తు అధికారి.. రవిప్రకాశ్‌తోపాటు నటుడు శివాజీ - టీవీ 9 మాజీ సీఎఫ్ వో మూర్తికి నోటీసులు జారీచేశారు. మూర్తి ఒక్కరే స్పందించి మూడురోజులుగా పోలీసుల ఎదుట హాజరై విచారణకు సహకరిస్తున్నారు. రవిప్రకాశ్ - శివాజీ మాత్రం ఇంతవరకు హాజరుకాలేదు. రవిప్రకాశ్ - శివాజీ పదిరోజుల గడువు కోరినప్పటికీ.. దర్యాప్తులో తీవ్రతను దృష్టిలో పెట్టుకొని వారికి అంత సమయం ఇచ్చే అవకాశంలేదని తెలుస్తోంది.
ఇలా, అన్ని దారులు మూసుకుపోతున్న తరుణంలో హైదరాబాద్ కేంద్రంగా తనకు ఇబ్బదులు తప్పవని భావించిన శివాజీ...నగరం నుంచి మకాం మార్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన ఇద్దరు పిల్లల చదువుపై సైతం శివాజి మథనపడుతున్నట్లు చెప్తున్నారు. తెలంగాణలో ఉంటే ఏనాటికైనా సమస్యలు ఖాయమని భావిస్తూ నగరంలోకి తన నివాసాన్ని అమ్మేసి, అమరావతికి చెక్కేసేందుకు శివాజీ సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అమరావతిలో ఉంటే, వైసీపీ అధికారంలోకి వస్తే ఇబ్బందులు తప్పవనే పరిస్థితి ఉన్నప్పటికీ - హైదరాబాద్ కంటే మేలైనదనే విషయాన్ని గమనించి శివాజి ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.