దేశంలో బోలెడన్ని సమస్యల ఉండగా.. వాటి నుంచి జనాల దృష్టిని మరల్చడానికే భారతీయ జనతా పార్టీ పౌరసత్వం వివాదాన్ని నెత్తికెత్తుకుందని విమర్శించారు శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. పౌరసత్వం చట్టం వీరసావర్కర్ సిద్ధాంతం కాదని కూడా ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. సావర్కర్ కలలు గన్న భారతదేశం బీజేపీ చెబుతున్నది కాదని ఆయన అన్నారు. ఇతర దేశాల మైనారిటీలను ఇండియాలోకి తీసుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
గత కొంతకాలంలో బీజేపీ- శివసేనల మధ్యన దూరం పెరిగిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలూ అందరికీ అవగాహనలో ఉన్నవే. ఇలాంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తీరుపై ఉద్ధవ్ ఠాక్రే మండి పడ్డారు.
దేశంలో ఇప్పుడు బీజేపీ సమాధానం చెప్పుకోవాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని ఆయన అన్నారు. మహిళలపై దాడులు, వ్యవసాయ ధారుల సమస్యలు, నిరుద్యోగం వంటి సమస్యలు ఇప్పుడు దేశాన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయని.. వాటిపై దృష్టి పెట్టాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తూ పౌరసత్వం చట్టాన్ని నెత్తికెత్తుకుందని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు.
మొత్తానికి పౌరసత్వం చట్టం విషయంలో భారతీయ జనతా పార్టీ క్రమంగా ఏకాకిగా మారుతున్నట్టుగా ఉంది. ఇది కేవలం ఇతర దేశాల్లోని ముస్లిం వ్యతిరేకం అని బీజేపీ చెబుతోంది. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో ముస్లింతో సంబంధం లేదని తెగల ప్రజలు కూడా ఈ చట్టంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు