పోలీసు మృతదేహాన్ని మోసిన ముఖ్యమంత్రి

Update: 2016-11-01 09:32 GMT
ఉగ్రవాదులు జైల్లోంచి తప్పించుకుంటూ జరిపిన దాడిలో హతమైన మధ్యప్రదేశ్ హెడ్ కానిస్టేబుల్ అంతిమయాత్రలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. అంతేకాదు.. తానే స్వయంగా కానిస్టేబుల్ మృతదేహాన్ని మోసి పోలీసులకు కొండంత ధైర్యమిచ్చారు.

భోపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకునే క్రమంలో డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమాశంకర్ యాదవ్ ను సిమీ ఉగ్రవాదులు దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం ఆయన భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. రమాశంకర్ కు నివాళి అర్పించి, అతని కుటుంబసభ్యులను ఓదార్చారు. అంతేకాదు, రమాశంకర్ పాడెను మోసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఉగ్రవాదులతో పోరాడి రమాశంకర్ ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. అతని కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం అందిస్తామని... అతని కుమార్తె వివాహానికి రూ. 5 లక్షల ఆర్థికసాయం చేస్తామని తెలిపారు. దీనికి తోడు, రమాశంకర్ నివసిస్తున్న కాలనీకి అతని పేరు పెడతామని చెప్పారు. సిమీ ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ పై కొందరు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని... ఇలాంటి సున్నితమైన అంశాలను రాజకీయాలకు వాడుకోవడం సరికాదని చౌహాన్ అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News