బీజేపీకి మరో షాక్ ఇవ్వబోతున్న శివసేన

Update: 2019-11-29 11:26 GMT
మహారాష్ట్రలో అంతులేని పట్టుదలతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదురించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివసేన తాజాగా మరో షాకిచ్చేందుకు రెడీ అవుతోందట.. మహారాష్ట్ర మాదిరిగానే గోవాలో అసమ్మతి నేతలతో గద్దెనెక్కిన బీజేపీ సర్కారును కూల్చడానికి రెడీ అయ్యిందట..

తాజాగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర మాదిరిగానే గోవాలోనూ త్వరలో అద్భుతం జరగబోతోందని సంచలన కామెంట్ చేశారు. గోవాలో బీజేపీ సర్కారును దించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్టు సంకేతాలిచ్చారు.

 బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చిన గోవా ఫార్వర్డ్ పార్టీ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్ తో శివసేన సంప్రదింపులు జరిపుతున్నట్టు ప్రకటించింది. కాంగ్రెస్ సహా వివిధపార్టీలతో కలిసి ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేసేందుకు శివసేన రంగంలోకి దిగింది. త్వరలోనే గోవాలో బీజేపీ సర్కారును కూల్చి కాంగ్రెస్ తో కలిసి మహారాష్ట్రలో వలే గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

Tags:    

Similar News